Begin typing your search above and press return to search.

బార్డ‌ర్ చుట్టూ య‌ద్ధ నౌక‌లు - యుద్ధ విమానాలు

By:  Tupaki Desk   |   24 Feb 2018 12:39 PM GMT
బార్డ‌ర్ చుట్టూ య‌ద్ధ నౌక‌లు - యుద్ధ విమానాలు
X
ఇరుగుపొరుగున ఉన్న భారత్-చైనా బోర్డర్ వద్ద పరిస్థితి ఉత్కంఠంగా మారుతోంది. ఓవైపు యుద్ధ నౌక‌లు మ‌రోవైపు యుద్ధ విమానాలు మోహ‌రింపు జ‌రుగుతోంది. ఇవ‌న్నీ పొరుగుదేశ‌మైన చైనా మ‌న విష‌యంలో కెలుకుతుండ‌టం గ‌మ‌నార్హం. రెండు దేశాల సరిహద్దు దగ్గర చైనా తన యుద్ధ విమానాలను మోహరించినట్లు రష్యాకు చెందిన స్పుత్నిక్ పత్రిక వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హిమాలయ పర్వత్రశ్రేణుల్లో ఫైటర్ జెట్లను సంసిద్ధంగా ఉంచినట్లు ఆ కథనంలో పేర్కొంది.

చెంగ్డూ జే-10 విగోరస్ డ్రాగన్ మల్టీరోల్ ఫైటర్స్ - షెన్‌ యాంగ్ జే-11 ఫైటర్లు బోర్డర్ సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ చైనా ప్రాంతంలో ఆ యుద్ధ విమానాలను సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు కూడా చైనా అధికారి ఒకరు తెలిపారు. భారత్‌ తో ఒకవేళ యుద్ధం తలెత్తితే ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫైటర్ జెట్లను మోహరించినట్లు చైనా ఆర్మీ నిపుణుడు స్పుత్నిక్‌తో తెలిపారు. బోర్డర్ వెంట ఇండియా తన సైన్యాన్ని ఎలా సమాయత్తం చేస్తుందో, అదే తరహాలో తాము కూడా మిలిటరీని పటిష్టం చేస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. భారత్ తన దగ్గర ఉన్న సుఖోయ్ 30 ఎంకేఐ లాంగ్ రేంజ్ ఫైటర్లను బోర్డర్ వద్ద మోహరించినట్లు చైనా పేర్కొంది.

ఇదిలాఉండ‌గా...మాల్దీవుల సంక్షోభం నేపథ్యంలో హిందూ మహా సముద్రంలో చైనా ఐదు యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో హిందూ మహా సముద్ర జలాల్లో తిష్ఠ వేసిన చైనా యుద్ధ నౌకల సంఖ్య 11కు చేరిందని ఆ దేశ వార్తా వెబ్‌ సైట్ పేర్కొన్నది. శ్రీలంకలో ప్రవాస జీవితం గడుపుతున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్.. తమ దేశంలోని సమస్య పరిష్కారానికి సైనిక జోక్యం చేసుకోవాలని భారత్‌ ను కోరారు. ఈ విషయ మై భారత్ జోక్యాన్ని వ్యతిరేకించిన చైనా.. హిందూ మహా సముద్ర జలాల్లో యుద్ధ నౌకలను మోహరించింది.