Begin typing your search above and press return to search.

చైనా వాడి తాజా ప్లాన్ వింటే షాక్ తినాల్సిందే

By:  Tupaki Desk   |   7 Sep 2017 5:42 AM GMT
చైనా వాడి తాజా ప్లాన్ వింటే షాక్ తినాల్సిందే
X
న‌మ్మ‌లేరు కానీ ఇది నిజం. భార‌త్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే గంట‌ల కొద్దీ కాలాన్ని విమానంలో గ‌డ‌పాల్సిందే. అయితే.. అలాంటి అవ‌స‌రం లేకుండా కేవ‌లం నాలుగంటే నాలుగు గంట‌ల వ్య‌వ‌ధిలో భార‌త్ నుంచి అమెరికాకు వెళ్లిపోవ‌చ్చ‌న్న మాట‌ను చెబుతున్నారు చైనా శాస్త్ర‌వేత్త‌లు. సృష్టికి ప్ర‌తి సృష్టి అన్న‌ట్లుగా చైనీయుల బుర్ర‌ల్లో పుట్టుకొచ్చే ఐడియాలు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

ఫ్యూచ‌ర్ ట్రాన్స్ పోర్ట్ ఎలా ఉండాల‌నే దానిపై చైనీయులు చేస్తున్న ఆలోచ‌న‌లు వింటే షాక్ తినాల్సిందే. ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న గంట‌కు 400 కిలోమీట‌ర్ల వేగానికి మించిన ర‌వాణా సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తేవాల‌ని ప్ర‌య‌త్నిస్తుండ‌టం తెలిసిందే. ఇందుకు ప‌రిష్కారంగా గంట‌కు 1200 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లే హైప‌ర్ లూప్ పేరిట స‌రికొత్త రవాణా వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దీనికి సంబంధించి టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎల‌న్ మ‌స్క్ భారీ ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇవి ఒక కొలిక్కి రాక ముందే మ‌రో కొత్త ఐడియాను తెర మీద‌కు తీసుకొచ్చారు.

దీనికి సంబంధించిన ప్లాన్ వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఊహ‌కు అంద‌నంత వేగాన్ని వాస్త‌వ రూపంలోకి తేవాల‌న్న దిశ‌గా ప‌రిశోధ‌న‌లు షురూ కావ‌టం విశేషం. గంట‌కు నాలుగు వేల కిలోమీట‌ర్ల దూరానికి దూసుకెళ్లేలా స‌రికొత్త ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను సృష్టించే స‌రికొత్త టెక్నాల‌జీ మీద దృష్టి పెట్టారు. ఈ కొత్త ప్రాజెక్టు పేరు టీ ఫ్లైట్‌. ఈ ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో మొద‌ట గంట‌కు వెయ్యి కిలోమీట‌ర్ల లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఆ త‌ర్వాత ఆ వేగాన్ని 4వేల కిలోమీట‌ర్ల‌కు పెంచాల‌న్న‌ది ప్లాన్‌.

ఒళ్లు జ‌ల‌ద‌రించే వేగంతో దూసుకెళ్లే ఈ స‌రికొత్త ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో సంప్ర‌దాయ ఇంధ‌న‌మైన పెట్రోల్‌.. డీజిల్ లాంటివి వాడ‌క‌పోవ‌టం.. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల ప్ర‌భావం ఏమీ లేక‌పోవ‌టం దీని ప్ర‌త్యేక‌త‌గా చెబుతున్నారు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న త‌ర‌హాలో ఈ ప్ర‌యాణం ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే.. ఈ ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ప్రాధ‌మిక సందేహం ఏమిటంటే.. గంట‌కు నాలుగువేల కిలోమీట‌ర్ల వేగాన్ని శ‌రీరం త‌ట్టుకుంటుందా? అన్న‌ది. దీనిపై వాదోప‌వాదాలున్నా.. తాము అనుకున్న‌ట్లుగా స‌రికొత్త ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు చైనీయులు. ఒక‌వేళ వారు అనుకున్న‌ట్లుగా గంట‌కు నాలుగువేల కిలోమీట‌ర్లు దూసుకెళ్ల‌గ‌లిగితే భార‌త్ - అమెరికా మ‌ధ్య ప్ర‌యాణ వేగం కేవ‌లం గంట‌కు త‌గ్గిపోతుంది. అదే జ‌రిగితే.. ప్ర‌పంచ జ‌న జీవ‌నం ఊహించ‌లేనంత వేగంగా మారిపోతుంది. అదే జ‌రిగితే.. ప్ర‌పంచ ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో పెను విప్ల‌వం చోటు చేసుకున్న‌ట్లే.