రాకేశ్ రెడ్డి కొంప ముంచిన ‘హాబీ’

Mon Feb 18 2019 12:23:03 GMT+0530 (IST)

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ ఆర్ ఐ చిగురుపాటి జయరాం చౌదరి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి ఉచ్చు బిగిసేలా ఓ పెద్ద సాక్ష్యాన్ని పోలీసులు పట్టుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాకేశ్ రెడ్డికి ఏ పని చేసినా సెల్ ఫోన్లో వీడియో తీసుకునే అలవాటు ఉందట.  ఈ హాబీ వల్లనే అతడు అడ్డంగా బుక్కయ్యాడని పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది.రాకేశ్ రెడ్డి తాను చేసే ప్రతీ పనిని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే జయరాం హత్య సంఘటనను కూడా రాకేశ్ రెడ్డి వీడియో తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. జయరాంను ఇంటికి పిలిపించి మాట్లాడిన దృశ్యాలతోపాటు అతడిని చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలు వీడియో తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడినట్లు సమాచారం. అదేవిధంగా ఏపీసీ మల్లారెడ్డితో రాకేశ్ రెడ్డి జయరాం హత్య అనంతరం 29సార్లు మాట్లాడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెల్సింది.

రాకేశ్ రెడ్డి తీసిన వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. వీడియోలను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఈ సాక్ష్యాలే కీలకంగా మారుతున్నాయి. జయరాం హత్య సంఘనటతో పాటు రాకేశ్ రెడ్డి సెల్ ఫోన్ లో మరో 50 నుంచి 60దాకా ఇతర వీడియోలు ఉన్నట్లు సమాచారం. వీటిన్నింటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఏది ఏమైనా రాకేశ్ రెడ్డి తన అలవాటు వల్లే పోలీసులకు అడ్డంగా బుక్కవడం గమన్హారం. హంతకులు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఏదోఒక విషయంలో అడ్డంగా బుక్కవుతారనే ఎన్నో సార్లు పోలీసులు రుజువు చేశారు. జయరాం హత్య సంఘటనలోనూ నిందితుడి హాబీనే అతన్ని అడ్డంగా ఇరికించిందని పోలీసులు చెబుతున్నారు.