Begin typing your search above and press return to search.

రాత్రి 10 త‌ర్వాత సోష‌ల్ పోస్టింగ్స్ చెక్ చేస్తే అంతేన‌ట‌!

By:  Tupaki Desk   |   17 May 2018 11:30 PM GMT
రాత్రి 10 త‌ర్వాత సోష‌ల్ పోస్టింగ్స్ చెక్ చేస్తే అంతేన‌ట‌!
X
ఆస‌క్తిక‌ర‌మైన స‌ర్వే రిపోర్ట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అత్యాధునిక సాంకేతిక‌త పుణ్య‌మా అని.. సోష‌ల్ మీడియాతో క‌నెక్ట్ కానోళ్లు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా.. సోష‌ల్ మీడియాలో అకౌంట్ తెర‌వ‌టం.. మొబైల్ లో అనుక్ష‌ణం ట్రాక్ చేయ‌టం అదో అల‌వాటుగా మారింది. ప‌గ‌లు రాత్రి అన్న తేడా లేకుండా ఎవ‌రేం పోస్టులు పెట్టటం.. దానికి ఎవ‌రెలా స్పందించారన్న‌ది చెక్ చేయ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది.

తాజాగా ఒక అధ్య‌య‌నం విడుద‌లైంది. దీని ప్ర‌కారం ఏమిటంటే.. చిన్నారుల మొద‌లు వృద్ధుల వ‌ర‌కూ పొద్దున్నే లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కూ అనుక్ష‌ణం చేతిలో ఉన్న ఫోన్ లో పెట్టిన పోస్టులు చెక్ చేసుకోవ‌టానికి సాయం చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌రిపిన స‌ర్వేలో.. చిన్నారుల నుంచి పెద్ద‌వ‌య‌స్కుల ఫోన్ వాడ‌కంపై స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. దీని ఆధారంగా నివేదిక వెల్ల‌డించారు. సోస‌ల్ మీడియా మోజులో ప‌డి నిద్రాహారాలు మానేసి ఆసుప‌త్రుల్లో చేరుస్తున్న వైనం ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ప‌గ‌లు.. రాత్రి అన్న తేడా లేకుండా సోష‌ల్ మీడియాలో గ‌డ‌ప‌టం మాన‌సిక రుగ్మ‌తల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. రాత్రి 10 గంట‌ల త‌ర్వాత కూడా సోష‌ల్ మీడియాతో ఎంగేజ్ అయ్యే వారికి మాన‌సిక రుగ్మ‌తులు ఎక్కువగా ఉంటాయ‌ని చెబుతున్నారు.

ఇలాంటి వారు.. తమ దిన‌చ‌ర్య‌ను మంద‌కొడిగా ప్రారంభించ‌టం.. బైపోలార్ డిజార్డ‌ర్ ద్వారా కోపం.. బాధ‌.. చిరాకు లాంటివి పెరుగుతాయ‌ని ఈ నివేదిక తేలింది. దాదాపు 91 వేల మందికి పైగా ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తీసుకొని తాజా నివేదిక‌ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. రాత్రిళ్లు ఆల‌స్యంగా నిద్ర పోయే అల‌వాటు ఉన్న వారు ప‌లు మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు లోన‌వుతున్న‌ట్లుగా తాజా ఫ‌లితం స్ప‌ష్టం చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.