Begin typing your search above and press return to search.

చంద్రుడూ.. ఐయామ్ కమింగ్: అసద్

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:28 AM GMT
చంద్రుడూ.. ఐయామ్ కమింగ్: అసద్
X
తెలంగాణపై డబ్బుల కట్టలు, అరువు నేతలను తీసుకొచ్చి దండయాత్ర చేసిన చంద్రబాబు బొక్కబోర్లా పడ్డ సంగతి తెలిసిందే..ఇప్పుడు ఆయన ఏపీకి పోయి తన రాష్ట్ర పాలన తాను చేసుకుంటున్నారు. కానీ ఇక్కడి తెలంగాణ నేతలు మాత్రం బాబును వదల బొమ్మాళీ అంటున్నారు. ఇప్పటికే బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించగా.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా సై అన్నారు.

తాజాగా అసద్.. ‘ఔర్ మిస్టర్ చంద్రుడూ.. నీ గురించి మరిచిపోయా.. చంద్రుడూ ఐయామ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్.. సిద్దంగా ఉండూ’ అంటూ సినిమాటిక్ స్టైల్లో చెప్పిన డైలాగ్ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నెట్టింట్లో అది హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు తమ క్రియేటివిటీని జోడించి స్ఫూఫ్ లు చేస్తూ తెగ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో అనుకున్నట్టే 7 సీట్లు సాధించిన ఎంఐఎం హైదరాబాద్ లోని దారుస్సలంలో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభలో ఓవైసీ వైవిధ్యంగా ప్రసంగించి ఆకట్టుకున్నారు. ‘తెలంగాణ ఎన్నికల్లో ముస్లింల ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తావా బాబూ.. టీడీపీకి వ్యతిరేకంగా.. మిత్రువు జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తా.. ఏపీకి వస్తా.. మా తడాఖా ఏంటో చూపిస్తా’ అంటూ చంద్రబాబును అసద్ హెచ్చరిస్తున్న వీడియో హల్ చల్ చేస్తోంది. సొంత రాష్ట్రంలోనే బాబుకు తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనూ బాబుకు రెండు సీట్లకు మించి రావని ఓవైసీ జోస్యం చెప్పారు.