పేదవాడి ప్రాణం..పిరమాల్ పాలు

Thu Mar 14 2019 18:51:19 GMT+0530 (IST)

భారతదేశం అనేక కులాలు - అనేక మతాలు - విభిన్న సాంప్రాదాయాల సమాహారం. అది ఒకప్పుడు కాని ఇప్పుడు మన దేశం లో రెండె రెండు కులాలు.. రెండె రెండు మతాలు. మొదటిది ధనిక కులం లేదా ధనిక  మతం. రెండు పేద కులం పేద మతం. అంతే... ధనికులు వారిలో వారే ఒకరికి ఒకరు అసారా.. బాసాటా... అది కూడ పేదవాడి పేరు చెప్పి నిట్టనిలువునా దోపిడీకి పాల్పడుతున్నారు. సరే ఇదంతా ఎందుకంటే...రాజు తలచకుంటే దెబ్బలకు కరువా అన్నట్లు అంబానీ కోరుకోవాలే కాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన కాళ్ల దగ్గర పరుస్తారు ఇక  పేదవారి ఆరోగ్యం ఓ లెక్కా... ఆంధ్రప్రదేశ్ లో చంద్రన్న సంచార  చికిత్స 104 వాహానాల నిర్వాహణ పిరామాల్ సంస్ద దక్కించుకుంది. ఈ సంస్ద అధినేత స్వయాన ముకేష్ అంబానీ వియ్యంకుడు కావడం కొసమెరుపు. 2016లో 104 వాహానాల నిర్వాహణ టెండర్ ను  దక్కించుకున్న ఈ సంస్ద తమ ఖతాలోకి అక్రమంగా కోట్లు - కోట్లు కొల్లగొడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 245 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. 104 నిర్వహణ బాధ్యత అంతా కూడా ప్రభుత్వానిదే మందులు - డిజీల్ - ఇతర ఖర్చులు - సిబ్బంది జీతాలు అన్ని కలిపి ప్రభుత్వం నెలకు 2.44 లక్షలు ఖర్చుచేస్తోంది. అయితే ఈ సొమ్మంతా కూడా పిరమాల్ సంస్ధ ఖాతలోకే జమ అవుతోంది. 104 నిర్వాహణకు ఆ సంస్ద నెలకు లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయటంలేదని - అక్రమంగా సొమ్మును ఆ సంస్ధకు చంద్రబాబు నాయుడు దోచిపెడుతున్నారని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఈనెల 31తో కాంట్రాక్ట్  ముగియనుంది. మళ్లీ అదే సంస్దకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టెండర్ పిరమాల్ సంస్దకు కాకుండా వేరే సంస్దకు అప్పచెప్పాలని హైకోర్టు అదేశించింది. అయితే ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ల దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా ఎన్నికల కోడ్ సాకుతో కాలయాపన చేయడం ఆ సంస్దకే 104 నిర్వహణ భాధ్యతలు తిరిగి కట్టపెట్టడంపై  చంద్రాబాబు నాయుడికి అంబానీ కి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి తేటతెల్లమయ్యాయని - పేదవాడి కడుపుకొట్టి  అంబానీ వంటి ధనికుడికి చంద్రబాబు నాయుడు కొమ్ముకాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.