Begin typing your search above and press return to search.

ఏంది బాబు?: 'నా రాష్ట్రానికి అన్యాయం చేయండి'

By:  Tupaki Desk   |   19 March 2018 4:47 AM GMT
ఏంది బాబు?:  నా రాష్ట్రానికి అన్యాయం చేయండి
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టంగ్ స్లిప్ అయ్యారు. పంగ‌డ‌పూట సైతం త‌న ప్ర‌త్య‌ర్థిగా మారిన మోడీపై విసుర్లు విసిరేందుకు ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌ని ఆయ‌న‌.. తాను హాజ‌రైన స‌భ‌ల్లో కేంద్రం తీరును త‌ప్పు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. అదే స‌మ‌యంలో.. రాష్ట్రం కోసం తాను ప‌డుతున్న క‌ష్టాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా చెప్పేందుకు ప‌డుతున్న తిప్ప‌లు అన్నిఇన్ని కావు.

ఈ ప్ర‌య‌త్నంలో బాబు నోరు జారారు. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల్లో ఒక్క అక్ష‌రం ఎక్ ట్రా వ‌చ్చి.. ఆయ‌న్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టేలా చేయ‌ట‌మేకాదు.. మ‌నసులోప‌లి మాట భ‌లే బ‌య‌ట‌కు వ‌చ్చిందే అంటూ విమ‌ర్శించే అవ‌కాశాన్ని త‌న‌కు తాను ఇచ్చారు. తాను టంగ్ స్లిప్ అయిన విష‌యాన్ని గుర్తించిన బాబు.. ఆ త‌ర్వాత మాట‌లు ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడ‌టం స‌దరు వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ఇంత‌కీ వీడియోలో ఉన్న దాని ప్ర‌కారం బాబు నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల్ని య‌థాత‌ధంగా చూస్తే.. లాస్ట్ బ‌డ్జెట్ చూసిన త‌ర్వాత భ‌రించ‌లేక‌పోయా. ఒక్క విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేశంలోని నాయ‌కులంతా నా త‌ర్వాతే ముఖ్య‌మంత్రులు అయ్యారు. నేను సీనియ‌ర్ గా ఉండి.. ఎక్క‌డా భేష‌జం లేకుండా ఎన్నిసార్లు వెళ్లి.. నా రాష్ట్రానికి అన్యాయం చేయండి.. గొంతెమ్మ కోర్కెలు కావు. ఆ రోజు పార్ల‌మెంటు బిల్లులో పొందుప‌ర్చిన అంశాలే. ఇంకోప‌క్క‌.. ఆనాటి ప్ర‌ధాన‌మంత్రి రాజ్య‌స‌భ‌లో హామీలు ఇచ్చారో వాటినే కోరాం అని వ్యాఖ్యానించారు. ఇందులో.. నా రాష్ట్రానికి అన్యాయం చేయండ‌న్న మాట‌ను ఒక‌టికి రెండుసార్లు హైలెట్ చేస్తున్నారు. నా రాష్ట్రానికి అన్యాయం చేయండ‌న్న మాట వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి