Begin typing your search above and press return to search.

స‌మ‌రానికి సై అంటున్న చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   24 Nov 2017 5:22 AM GMT
స‌మ‌రానికి సై అంటున్న చంద్ర‌బాబు
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు స్థానిక ఎన్నిక‌లునిర్వ‌హించ‌ట‌మా? దాదాపుగా అన్ని ప్ర‌భుత్వాలు ఇలాంటి అంశాల్ని ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద ప్ర‌భావం చూపించే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా వ‌దిలేసి.. కోర్టులు క‌ల్పించుకుంటే త‌ప్ప వాటి మీద దృష్టి పెట్ట‌ని వైనం క‌నిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా.. స‌మ‌రానికి సై అంటున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా స్థానికసంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించింది అప్ప‌టి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వం. ఉమ్మ‌డి రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కారం స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మొట్టికాయ వేస్తూ కోర్టు విధించిన గ‌డువు నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించారు.

దీంతో అప్ప‌టి వ‌ర‌కూ వాయిదాల మీద వాయిదాలు ప‌డిన మునిసిప‌ల్‌.. కార్పొరేష‌న్లు.. ఎంపీపీ.. జెడ్పీటీసీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించారు. అయితే.. నాడు ఎన్నిక‌లు నిర్వ‌హించిన ప్ర‌భుత్వం.. వాటి ఫ‌లితాల్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఎందుకంటే.. స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించిన రోజుల వ్య‌వ‌ధిలోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉండ‌టంతో ఫ‌లితాల్ని ప్ర‌క‌టించ‌కుండా వాయిదా వేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లిత‌ల వెల్ల‌డికి కాస్త ముందుగా విడుద‌ల చేశారు.

ఈసారి మాత్రం అలాంటి ప‌రిస్థితి చోటు చేసుకోకుండా ఉండేలా ఏపీ స‌ర్కారు ప్లాన్ చేస్తోంది. షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని భావిస్తోంది. బాబు స‌ర్కారు. షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో షెడ్యూల్ తేడా రాకుండా ఉండేలా ముందుగానే రెఢీ అయిపోతోంది. వ‌చ్చే ఏడాది విద్యార్థుల ప‌రీక్ష‌లు పూర్తి అయిన త‌ర్వాత‌.. స్థానిక సంస్థ‌ల స‌మ‌రానికి శంఖం మోగించేలా ఏపీ స‌ర్కార్ ప్లాన్ చేస్తోంది. స్థానిక ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌భుత్వ పరంగా చేప‌ట్టే ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్క‌డ బాబు వ్యూహం ఏమిటంటే.. ప్ర‌త్యేక ప‌రిస్థితులు త‌ప్పించి మిగిలిన వేళ‌ల్లో అధికార‌ప‌క్షానికి అనుకూలంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉంటాయి. దీన్ని వాడుకొని స్థానిక ఫ‌లితాల్లో వ‌చ్చే సానుకూల సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా చేసి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌న్న‌ది బాబు ఎత్తుగ‌డ‌గా భావిస్తున్నారు. బాబు ఆలోచ‌న ఇలా ఉంటే తెలుగు త‌మ్ముళ్ల ఆలోచ‌న మ‌రోలా ఉంది. బాబు మాదిరి స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని ఎంపీలు.. ఎమ్మెల్యేలు కోరుకోవ‌టం క‌నిపిస్తోంది.

బాబు ఆలోచిస్తున్న‌ట్లుగా ఎన్నిక‌లు జ‌రిగిన ప‌క్షంలో స్థానిక రాజ‌కీయాలు.. విభేదాలు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించి త‌మ తుది ఫ‌లితం మీద ప్ర‌భావితం చూపిస్తాయేమోన‌న్న‌ది వారి భ‌యంగా చెబుతున్నారు. దీంతో.. స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో వ‌ద్ద‌న్న‌దే త‌మ్ముళ్ల ఆలోచ‌న‌గా తెలుస్తోంది. మ‌రి.. బాబు ఆలోచ‌న వాస్త‌వ రూపం దాలుస్తుందా. త‌మ్ముళ్ల ఆలోచ‌న‌కు ఓకే అంటూ వెన‌క్కి త‌గ్గుతారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కున్న స‌మాచారం ప్ర‌కారం స్థానిక స‌మ‌రానికి సై అనేలా బాబు నిర్ణ‌యం ఉంటుంద‌ని భావిస్తున్నారు.