Begin typing your search above and press return to search.

బాబూ... నిన్ను వదలా!

By:  Tupaki Desk   |   16 Dec 2018 3:42 PM GMT
బాబూ... నిన్ను వదలా!
X
కొందరిని ప్రకృతి కరుణించదు. కొందరిపై ప్రకృతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వారి పొడ కూడా తనకు ఇష్టం లేనట్లుగా ప్రకృతి కన్నెర్ర జేస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో ప్రకృతి ఎప్పటికప్పుడు తన ఆగ్రహాన్ని అనురాగాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. ఎందుకో ఎమిటో తెలియదు కాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడంటే ప్రకృతికి ప్రకోపం ఎక్కువే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతివృష్టి లేకపోతే అనావృష్టి. వర్షాలు కురియాల్సిన సమయంలో అవిలేవు. పంటలు ఏపుగా పండిన తర్వాత పంట చేతికి వచ్చే సమయంలో ఆకాల వర్షాలు. సమైక్య రాష్ట్రంలోను... రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే జరిగింది. మొత్తానికి చంద్రబాబు నాయుడి నాయకత్వంపై ప్రకృతి ప్రకోపం మాత్రం తగ్గడం లేదు.

సమైక రాష్ట్రం రెండుగా చీలిపోయింది. దీనికి ప్రధాన కారకుల్లో చంద్రబాబు ఒక‌రు అనుకోవాలి. తన సహచరుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ ఉద్యమం ఊపుందుకుంది. అది కాస్తా రాష్ట్రం విడిపోయేలా చేసింది. అది చంద్రబాబు నాయుడి తొలి విపత్తుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఏర్పడింది. అంతే ప్రకృతి తన ప్రకోపాన్ని మరోసారి చూపించింది. హుద్‌ హుద్ తుపాన్‌ పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలను - ముఖ్యంగా విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. ఈ విపత్తు నుండి ప్రజలను కాపాడడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ తర్వాత ఈ మధ్యనే తితిలీ తుపాను మరోసారి ఉత్తరాంధ్రను వణికించింది. ఈ తుపాను కారణంగా లక్షలాది మంది ప్రజలు చాలా ఇక్కట్లు పాలైయ్యారు.

తాజాగా మరోసారి పెథాయ్ తుపాను ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌ లోని అనేక జిల్లాలను వణికిస్తోంది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇన్ని తుపానులు ఎదురుకోవడం ఎప్పడు లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సమైక్య రాష్ట్రాన్ని అనావృష్టి వేధించింది. వేలాది మంది రైతులు వర్షాలు లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రం విడిపోయిన నాలుగేళ్లలో మూడు అతిపెద్ద తుపానులతో అతివృష్టి సంభవించింది. ఈ పరిణామాలు చంద్రబాబుపై ప్రకృతికి ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.