ఆలస్యంగా ఐడియా ఇచ్చిన బాబు

Thu May 17 2018 12:42:23 GMT+0530 (IST)

కర్ణాటకలో అధికారానికి సరిపడా మెజార్టీ రాకపోయినా గవర్నర్ విచక్షణాధికారంతో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ప్రత్యేకహోదా అంశంలో ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్న ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ మీద గుర్రుగా ఉన్నాడు. కర్ణాటకలో ఉన్న తెలుగువారికి ఇటీవల ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాడు. అయితే తాజాగా చంద్రబాబు కర్ణాటక పరిణామాలపై కీలకవ్యాఖ్యలు చేశారు.కర్ణాటకలో బీజేపీ తీరు సరికాదని - ఆ పార్టీ పదే పదే తప్పులు చేస్తుందని తప్పుపట్టిన చంద్రబాబు కాంగ్రెస్ - జేడీఎస్ లు పోరుబాటను ఎంచుకోలేదని - ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ ముందే బైఠాయించి అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటే దేశమంతా చర్చజరిగి జాతీయ మీడియాను ఆకర్షించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. గవర్నర్ కూడా కాంగ్రెస్ - జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందని అన్నట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్ లో పెట్టి మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి తన ఎమ్మెల్యేల కోసం వచ్చిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన చంద్రాబాబు నాయుడు కర్ణాటక రాజకీయం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. అయినా నిన్న ఇదే ఐడియా చంద్రబాబు కర్ణాటక కాంగ్రెస్ - జేడీఎస్ లకు ఇవ్వాల్సింది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశాక ఇచ్చి ఏం లాభమో బాబుకే తెలియాలి.