Begin typing your search above and press return to search.

అధికారుల‌కు షాకింగ్ గా మారిన బాబు ఆదేశాలు

By:  Tupaki Desk   |   21 May 2018 7:45 AM GMT
అధికారుల‌కు షాకింగ్ గా మారిన బాబు ఆదేశాలు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏమైంది. పార్టీలో అంత‌కంత‌కూ పెరుగుతున్న అనైక్య‌త‌. అధినాయ‌కుడిపై పెరుగుతున్న అసంతృప్తి.. మొత్తంగా అధికార పార్టీలో లుక‌లుక‌లు అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టం.. తానే స్వ‌యంగా చెప్పినా విన‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌ల తీరు బాబు మీద ప్ర‌భావం చూపిస్తుందా? ఆయ‌న నియంత్ర‌ణ కోల్పోతున్నారా? తానేం మాట్లాడుతున్నానో తెలీకుండా మాట్లాడేస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీ విప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్రతో బాబు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా మ‌రోవైపు పోరాట‌యాత్ర పేరుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ యాత్ర‌ను చేప‌ట్ట‌టం.. ఈ ఇరువురి టార్గెట్ గా మారిన వైనాన్ని బాబు త‌ట్టుకోలేక‌పోతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఒక‌రికంటే మ‌రొక‌రు అన్న‌ట్లుగా త‌న‌ను టార్గెట్ చేయ‌టం.. దానికి ధీటుగా స‌మాధానం చెప్పే నేత‌లుపార్టీలో లేక‌పోవ‌టం బాబుకు ఇబ్బందిగా మారింది. ఇలా తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్న చంద్ర‌బాబు.. తాజాగా నీరు-ప్ర‌గ‌తి ప‌థ‌కంపై టెలీ కాన్ఫ‌రెన్స్ ను నిర్వ‌హించారు. ఈ రివ్యూ మీటింగ్‌కు ప‌లువురు సీనియ‌ర్ అధికారులు హాజ‌ర‌య్యారు.

ఏపీలో పెరుగుతున్న ఎండ తీవ్ర‌త గురించి.. ఎండ కార‌ణంగా ప్ర‌జ‌లకు ఎదుర‌వుతున్న ఇబ్బందుల్ని ప్ర‌స్తావించారు. ఒక‌వేళ‌.. ఇంత‌టితో బాబు ముగించి ఉంటే.. అస‌లీ వార్త వ‌చ్చేదే కాదేమో.

టెలి కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని.. ఉష్ణోగ్ర‌త‌ల్ని త‌గ్గించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అమ‌రావ‌తి ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ను త‌గ్గించాలంటూ ఆదేశం జారీ చేశారు. దీంతో.. ఒక్క‌సారిగా షాక్ తిన్నారు అధికారులు. ఎక్క‌డైనా.. ఎండ‌ల్ని ఏ ముఖ్య‌మంత్రి చెప్పినా త‌గ్గించ‌లేర‌న్న‌ది తెలిసిందే. అయినా.. ఎండ‌ల్ని ఏ అధికారి మాత్రం చేతులు పెట్టి ఆప‌గ‌ల‌రు? అన్న‌ది పాయింట్. ఈ రీతిలో అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వ‌టం బాబుకు మాత్ర‌మే సాధ్య‌మేమో? మొత్తానికి ప్ర‌కృతిని సైతం కంట్రోల్ చేసేలా త‌న అధికారులు మారాల‌ని బాబు అనుకోవ‌టం షాకింగ్ గా మారింది. బాబు లాంటోడు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఏమిటి? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది.