Begin typing your search above and press return to search.

బాబు ఎంత ఓపెన్ అయ్యారంటే..

By:  Tupaki Desk   |   4 Dec 2016 7:42 AM GMT
బాబు ఎంత ఓపెన్ అయ్యారంటే..
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే కాస్త బోరింగ్ గా ఉంటాయని పలువురు తరచూ ఆరోపిస్తుంటారు.అయితే.. ఆయన నోటి నుంచి అలాంటి మాటలు రావటానికి.. ఆయన ఎంత కారణమో.. అలా వచ్చేలా ప్రశ్నలు వేసే వారిది కూడా అంతే తప్పు అన్నది మర్చిపోకూడదు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ (హిందుస్థాన్ టైమ్స్) నిర్వహించిన కార్యక్రమానికి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన పలు సమాధానాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఇలాంటి మాటలు బాబేనా మాట్లాడిందన్న భావన కలగటం ఖాయం. ఇంతకీ.. బాబేం చెప్పారో చూస్తే..

= వచ్చే ఎన్నికల్లో బీజేపీపై పోటీ తప్పదన్న సందేహం మీకు ఎందుకు వచ్చింది? నమ్మకంతో కలిసి పోటీ చేశాం.. మా మధ్య సంబంధాలు బాగున్నాయి.

= హైదరాబాద్ ను మహానగరంగా మార్చేందుకు ఒక ప్రయోగం చేశారు. ఫలితం ఇచ్చింది. 35 లక్షలున్న హైదరాబాద్ ను కోటి జనాభాకు పెంచాం. కాబట్టే హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ హబ్ గా మారింది. ఇప్పుడు మేం కొత్త రాజధానిని నిర్మించుకోవాలి. అంటే.. భారీగా నిధులు కావాలి. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని అడిగితే ప్రజలు స్పందించి 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. వాటిల్లో 25 నుంచి 30శాతం వారికి తిరిగి ఇచ్చేస్తాం. రాజధానిని నిర్మించటం చాలా అరుదైన అవకాశం. అమరావతి నిజమైన స్మార్ట్ సిటీ అవుతుంది. దేశంలో టాప్ వన్.. ప్రపంచంలో టాప్ టెన్ నగరాల్లో ఒకటి అవుతుంది. అమరావతికి 50కిలోమీటర్లు ఇరువైపులా నీరు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది కనిపించదు. విశాఖపట్నంలాంటి సముద్ర తీర నగరాలు ఉన్నాయి. కానీ.. అమరావతి లాంటి మంచినీరు లభించే నగరాలు లేవు. అదే అమరావతికి కలిసొచ్చే అంశం.

= ఒక నగరాన్ని నిర్మించటానికి 30 – 40 ఏళ్లు పడుతుందని ఎందుకు అనుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ ను తొమ్మిదిన్నరేళ్లలో అభివృద్ధి చేశాం. అమరావతి విజయవాడ.. గుంటూరు మధ్యలో ఉంది. మరోవైపు తెనాలి ఉంది. ఇప్పటికే 20 -25 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇంకా పెరుగుతారు.

= గతంలో నన్ను ఎవరో ఓడించలేదు. నా చర్యలే నన్ను ఓడించాయి. అందుకే.. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ఎప్పుడూ ప్రజలు నన్ను ఎన్నుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.

= బీజేపీతో సంబంధాలు బాగున్నాయి. ఎన్నికల ముందే కలిసి పోటీ చేశాం. కేంద్ర మంత్రివర్గంలో ఉన్నాం. నా కేబినెట్ లో బీజేపీ ఉంది. విభజన చట్టంలో ఇచ్చిన కొన్ని హామీల్ని నెరవేర్చారు. మరికొన్ని అమలు కావాలి.

= తెలంగాణతో పోటీ పడితే మీ హైదరాబాద్ తో మీరే పడినట్లు అని అడుగుతున్నారు. మీరు తెలంగాణతో ఎందుకు పోల్చుతున్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. అదింకా పెరగాలి. ఆంధ్రప్రజలు నాకు అధికారం ఇచ్చారు. మరో రాజధాని కట్టాలని కోరారు. నేను కడతాను. హైదరాబాద్ లో వద్దు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండని కోరను. అక్కడ మైక్రోసాఫ్ట్ కేంద్రం ఉంది. అమరావతిలో కూడా పెట్టాలని కోరతా. తప్పేం ఉంది. మనం బలంగా ఉంటే అంతా వస్తారు. అప్పట్లో బిట్ గేట్స్ కలవాలనుకున్నా. ఢిల్లీకి వస్తున్నారని టైం అడిగితే.. రాజకీయ నాయకుల్నికలవనని చెప్పారు. 5 నిమిషాలు టైం అడిగి కలిస్తే.. 40 నిమిషాలు మాట్లాడారు. మీ విజన్ తో ఏకీభవిస్తున్నాం. నేనేం చేయాలని అడిగారు. హైదరాబాద్ రమ్మని కోరా. ఆ తర్వాత అక్కడ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు.

= పెద్ద నోట్ల రద్దు సమస్యగా ఉంది. ప్రజల ఇబ్బందుల్ని తగ్గించి.. సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది.

= విడిపోవటం మంచిదని ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? అదంతా ముగిసిపోయింది. విభజన జరిగిపోయింది. ఇది వాస్తవం.రెండు రాష్ట్రాలూ మంచి అవకాశాలకోసం ముందుకు వెళ్లాలి. మేం కలిసి పని చేయాలి. నిన్నటివరకూ ఇది ఒకటే రాష్ట్రం. పైగా అందరూ తెలుగువారే. చాలా విషయాల్లో ఒకరిపై ఒకరు అధారపడి.. కలిసి పని చేయాల్సిందే. మాకు నౌకాశ్రయాలు ఉన్నాయి. వాటిని వారు వాడుకోవాలి. తెలంగాణకు హైదరాబాద్ బలం. మేం దాన్ని వాడుకోవాలి. మా ప్రజలు చాలామంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు.

=కేసీఆర్ తో సంబంధాలు బాగున్నాయి. ఆయన నా సహచరుడే. మా పార్టీలోనే ఉండేవారు. విభజన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి. పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/