Begin typing your search above and press return to search.

రాహుల్ ప్రధానైతే కనుక ఆ క్రెడిట్ బాబుదే..

By:  Tupaki Desk   |   23 May 2018 1:29 PM GMT
రాహుల్ ప్రధానైతే కనుక ఆ క్రెడిట్ బాబుదే..
X
కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో అరుదైన సన్నివేశం ఒకటి కనిపించింది. అది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - టీడీపీ అధినేత చంద్రబాబు చేయిచేయి కలపడం .అంతేకాదు... రాహుల్ ‌ను చంద్రబాబు భుజం తట్టి అభినందించారు కూడా. దీంతో అన్ని విజయాలూ తన ఖాతాలో వేసుకునే చంద్రబాబుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భవిష్యత్తులో కనుక రాహుల్ ప్రధానైతే.. తాను భుజం తట్టి అభినందించడం వల్లే రాహుల్ ధైర్యంగా బీజేపీని తట్టుకుని నిలిచి ప్రధానయ్యారని చంద్రబాబు ఎప్పుడైనా చెప్పే అవకాశముందంటూ సెటైర్లేస్తున్నారు.

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ వేదికపై సోనియాగాంధీ - రాహుల్ గాంధీ - చంద్రబాబు - మమతా బెనర్జీ - మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు. ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత వేదికపై ఉన్న పెద్దలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ, చేతులు గాల్లో ఊపారు. ఇంతలోనే చంద్రబాబు వద్దకు రాహుల్ గాంధీ వచ్చి - షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి, అభినందించారు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు.

సాధారణంగా కాంగ్రెస్ పెద్దలతో వేదిక పంచుకోని చంద్రబాబు ఈసారి రాహుల్ పక్కనే కూర్చోవడం, ఆయనతో ముచ్చటించడం.. భుజం తట్టడం వంటివన్నీ 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు కాంగ్రెస్ తో కలుస్తారనడానికి సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.