నానా యాగి చేసి.. బాబు సేఫ్ గేమ్

Thu Sep 20 2018 13:33:13 GMT+0530 (IST)

అంతన్నాడు.. ఇంతన్నాడు.. ఇప్పుడు కోర్టుకు లాయర్ ను పంపుతున్నాడు చంద్రబాబు.. ఆయన ఆడిందే ఆట.. ఆయన నోటికొచ్చిందే మాటగా ఉంది పరిస్థితి. మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటి నుంచి తెలుగు వాళ్లపై బీజేపీ కక్ష కట్టిందని.. తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు ఇప్పుుడు తీరిగ్గా బురదంతా చల్లేసి తను మాత్రం అరెస్ట్ వారెంట్ పై లాయర్ తో పిటీషన్ వేయిస్తున్నారట.. కేసు ఆయనది .. పాపం బలైపోయింది మాత్రం బీజేపీ మోడీ అని అందరూ చర్చించుకుంటున్నారు.బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు మహారాష్ట్ర వెళ్లి ఆందోళన చేశారు. అప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత కేసు నమోదు చేసి విడుదల చేశారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందన లేదట.. దీంతో శరామామూలుగానే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ వారెంట్లను బేస్ చేసుకొని చంద్రబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఆ నెపాన్ని మోడీపై నెట్టి అభాసుపాలు చేశాడు. ఇప్పుడు తీరిగ్గా తన తరఫున న్యాయవాదిని ధర్మాబాద్ కోర్టుకు పంపి వారెంట్ పై రీకాల్ పిటీషన్ వేయాలని చంద్రబాబు నిర్ణయించారట.. ఈ మాత్రం పని ముందే అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడే చేసి ఉంటే ఇంత యాగి ఉండేది కాదు కదా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. దీన్ని బేస్ చేసుకొని బీజేపీ-  మోడీని ఏపీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేందుకు బాబు చేసిన హంగామా అంతా ఇంతాకాదంటూ మండిపడుతున్నాయి... న్యాయవ్యవస్థ తన పని తాను చేస్తే చంద్రబాబు మాత్రం మోడీపై ఈ బాణం విసిరి ఆడుకున్నాడని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. తన లోపాన్ని ఇతరులపై మళ్లించడంలో బాబు సక్సెస్ అయ్యాడని ఆడిపోసుకుంటున్నారు.