Begin typing your search above and press return to search.

బెజవాడంటే భయపడుతున్నారంటున్న బాబు

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:15 AM GMT
బెజవాడంటే భయపడుతున్నారంటున్న బాబు
X
ఏపీ రాజధాని నగరమైన బెజవాడ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెజవాడ భయపెడుతోందని చెప్పుకొచ్చారు. బెజవాడలో ఇళ్ల అద్దెలు చూసి భయపడుతున్నారని.. నిజానికి అద్దెలు ఎక్కువగా ఉండటమే బెజవాడ అభివృద్ధి చెందకపోవటానికి కారణం అంటూ సరికొత్త వాదనను తీసుకొచ్చారు. బెజవాడలో తాజాగా ఏర్పాటు చేసిన ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించిన చంద్రబాబు బెజవాడకు రావాలంటే చాలామంది భయపడుతున్నారని.. ఇక్కడి అద్దెలు బెదురు పుట్టిస్తున్నాయని చెప్పుకొచచారు.

ముంబయి.. కోల్ కతా లాంటి మెట్రో నగరాల కంటే కూడా విజయవాడలో అద్దెలు భారీగా ఉన్నాయని.. ఈ కారణంతో బెజవాడకు రావాలని అనుకునే వారి అద్దెల్ని చూసి భయపడుతున్నారన్నారు. ఇప్పటివరకూ సామాన్యులకు మాత్రమే ఎదురయ్యే అద్దె ఇబ్బంది ఏపీ ముఖ్యమంత్రి వరకూ వెళ్లటమే కాదు.. ఆయన ప్రత్యేకంగా ఈ విషయాన్నిప్రస్తావిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. అద్దెల విషయంలో బెజవాడ ప్రజలు సానుకూలంగా స్పందించాలని కోరుతున్న చంద్రబాబు మాటకు బెజవాడ ప్రజలు ఎలా స్పందిస్తారో మరి..?