Begin typing your search above and press return to search.

బాబు బ్యాచ్ కు ద‌డ పుట్టిస్తున్న జ‌గ‌న్ అండ్ కో!

By:  Tupaki Desk   |   21 Feb 2019 5:10 AM GMT
బాబు బ్యాచ్ కు ద‌డ పుట్టిస్తున్న జ‌గ‌న్ అండ్ కో!
X
కాన్ఫిడెన్స్ ఓకే. కానీ.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో లేనిపోని తిప్ప‌లు. ఈ విష‌యాన్ని ఏపీ అధికార‌ప‌క్షానికి అర్థ‌మ‌య్యేస‌రికి పుణ్య కాలం గ‌డిచిపోయింది. వాపును చూసి బ‌లుపుగా భావించిన చంద్ర‌బాబుకు.. ఇప్పుడు ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. స్వార్థ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ఆయ‌న తీరుకు మూల్యం చెల్లిస్తున్న ప‌రిస్థితి. అవ‌కాశ‌వాద రాజ‌కీయం లేదంటే.. కేసుల బూచితో ఒక ఆట ఆడుకున్న బాబు బ్యాచ్ కు.. ఇప్పుడు అందుకు త‌గ్గ షాకులు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి త‌గులుతున్నాయి.

ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌.. త‌మ‌కు తిరుగులేద‌న్న అత్యుత్సాహం ఎంత పెద్ద త‌ప్పిద‌మో బాబు బ్యాచ్ కు ఇప్పుడు అర్థ‌మైంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా పార్టీని వీడుతున్న వేళ‌.. పార్టీ వ‌ర్గాలు నిరాశ‌..నిస్పృహ‌ల‌కు గుర‌వుతున్నాయి. ఎన్నిక‌ల వేళ అధికార‌ప‌క్షంలోకి వెళ్ల‌టం అల‌వాటు. ఇందుకు భిన్నంగా విప‌క్షంలోకి అధికార‌ప‌క్ష నేత‌లు క్యూ క‌డుతున్న వైనం బాబు స‌ర్కారు మీద ప్ర‌జ‌ల్లో ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెబుతున్నారు.

అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు నిలువెత్తు రూపం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే బాబు.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న చెప్పిన మాట‌లు.. మార్చిన స్టాండ్ తో ఆయ‌న‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం త‌గ్గిపోయింది. ఏపీకి హోదా అక్క‌ర్లేద‌న్న మాట‌ను మొహ‌మాటం లేకుండా చెప్పేయ‌ట‌మే కాదు.. మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయ‌టం లాంటి చాలా విష‌యాలు ఇప్పుడు ఆంధ్రోళ్ల మ‌ధ్య హాట్ టాపిక్ గా మారాయి.

ఈ రోజు మోడీని అన్నేసి మాట‌లు అంటున్న చంద్ర‌బాబు.. గ‌తంలో ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ బాబు తీరును ఎండ‌గ‌డుతున్నారు. బాబు బ్యాచ్ చేసిన త‌ప్పుల చిట్టాను విప్పుతున్న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌లేక ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో కిందా మీదా ప‌డుతున్న వైనం చూస్తే.. వారిలో త‌గ్గిన ఆత్మ‌విశ్వాసం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

జ‌గ‌న్ ఫారిన్ టూర్ నేప‌థ్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే నేత‌ల హ‌డావుడి కాస్త త‌గ్గిన‌ట్లుగా క‌నిపించినా.. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత భారీ షాకులు ఉంటాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఈ స్థాయిలో ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న నేప‌థ్యంలో.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ మ‌రెన్ని షాకుల‌కు జ‌గ‌న్ బ్యాచ్ ప్లాన్ సెట్ చేసింద‌న్న అనుమానం తెలుగు త‌మ్ముళ్ల‌ను ప‌ట్టి పీడిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన బాబు బ్యాచ్.. ఇప్పుడు అందుకు భిన్నంగా డిఫెన్స్ లో ప‌డ‌టం.. వివ‌ర‌ణ‌ల మీద వివ‌ర‌ణ‌లు ఇచ్చుకుంటున్న తీరు చూస్తే.. బాబు అండ్ కోకు జ‌గ‌న్ ఫోబియా ప‌ట్టేసింద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.