Begin typing your search above and press return to search.

క‌డ‌ప‌లో టీడీపీ క్లోజ్‌!..బాబు స్వ‌యంకృత‌మే!

By:  Tupaki Desk   |   23 Jan 2019 1:30 AM GMT
క‌డ‌ప‌లో టీడీపీ క్లోజ్‌!..బాబు స్వ‌యంకృత‌మే!
X
ఏపీలో ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ... ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అప్ప‌టిదాకా కొన‌సాగిన పార్టీలో త‌మ‌కు ద‌క్కిన గౌర‌వం - ఎదురైన చేదు అనుభ‌వాల‌ను బేరీజు వేసుకుంటున్న నేత‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప్ర‌త్యామ్నాయాలేమిట‌ని దృష్టి సారించ‌డం స‌హ‌జ‌మే. ఇదే విష‌యాన్ని అవ‌కాశంగా తీసుకుని ఇష్టం నేత‌లను పార్టీ నుంచి వెళ్ల‌గొట్టేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు - కీల‌క నేత‌లు కూడా త‌మ‌దైన ప్లాన్లు అమ‌లు చేస్తుంటారు. ఈ త‌ర‌హా అప‌స‌వ్య ఆలోచ‌న‌లు చేయ‌డంలో టీడీపీని మించిన పార్టీ లేద‌ని తాజా ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్లే ఇట్టే అర్థం కాక మాన‌దు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీని గెలిపించుకుని వ‌స్తార‌ని అంచ‌నాలు ఉన్న నేత‌ల‌ను కూడా బ‌య‌ట‌కు త‌రిమేయ‌డంలో టీడీపీ త‌న‌దైన శైలి వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందుకు ఉదాహ‌ర‌ణే క‌డ‌ప జిల్లా రాజంపేట‌లో రాజుకున్న టీడీపీ కుంప‌టి.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన టీడీపీ... జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం కార‌ణంగా ఒక్క రాజంపేట అసెంబ్లీని మాత్ర‌మే ద‌క్కించుకుంది. అక్క‌డ కూడా దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడిగా ఉంటూ టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి విజ‌యం సాధించారు. జిల్లా మొత్తం మీద ఒకే ఒక్క ఎమ్మెల్యేగా మేడా గెల‌వ‌డంతో ఆయ‌న‌కు చంద్ర‌బాబు విప్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అయితే వైఎస్ అనుచ‌రుడని పేరుండ‌టంతో ఆయ‌న‌కు పార్టీలో పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేద‌నే చెప్పాలి. గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా పార్టీలో త‌న‌కు ఎదుర‌వుతున్న అవ‌మానాల‌ను పంటి బిగువున‌నే భ‌రిస్తూ వ‌స్తున్న మేడా... టీడీపీని వ‌ద‌లాల‌ని ఏనాడూ అనుకోలేదు. అయితే టీడీపీ గ్రూపు రాజ‌కీయాలు - వైసీపీ టికెట్ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించి ఏకంగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న ఆదినారాయ‌ణ రెడ్డి ఇప్పుడు రాజంపేట‌లో మ‌కాం పెట్టేశారు. మేడాను ప‌క్క‌న‌పెట్టేసి... త‌న అనుచ‌ర వర్గానికి టికెట్ ఇప్పించుకోవాల‌ని చాలా సైలెంట్‌గానే పావులు క‌దిపిన ఆది... మేడాకు తీవ్ర ఆగ్ర‌హాన్నే తెప్పించారు. అయినా కూడా మేడా పార్టీ మారే యోచ‌న‌కు రాలేక‌పోయారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని ఆ ప‌దవి కాలం ముగియ‌కుండా పార్టీ ఫిరాయించే ఆలోచ‌న త‌న ద‌రికే చేర‌నీయ‌లేదు. అయితే టీడీపీ త‌ర‌హా గ్రూపు రాజ‌కీయాలు మేడాను పార్టీ వీడేలా చేశాయ‌ని చెప్పాలి.

ఈ క్ర‌మంలో గ‌డ‌చిన నాలుగు రోజులుగా రాజంపేట ప‌రిధిలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌తో మేడా తీవ్ర మ‌న‌స్తాపం చెంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఎంత‌కాలం ఉన్నా టీడీపీ త‌న‌కు గౌర‌వం ఇవ్వ‌ద‌న్న ఓ నిశ్చిత అభిప్రాయానికి వ‌చ్చిన మేడా... ఇప్పుడు వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నేటి మ‌ధ్యాహ్నం వైసీపీ అధినేత - త‌న రాజ‌కీయ గురువు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 31న లాంఛ‌నంగా వైసీపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మేడా... టీడీపీలో త‌న‌కు ఎదురైన చేదు అనుభవాల‌ను ఏక‌రువు పెట్టారు. పార్టీ నుంచి త‌న‌ను వెళ్ల‌గొట్టేలా టీడీపీ పావులు క‌దిపింద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. వైసీపీలోకి చేరుతుండ‌టం త‌న సొంతింటికి వ‌చ్చిన‌ట్టుగా ఉంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే.... పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేను చేజేతులారా బ‌య‌ట‌కు పంపిన టీడీపీ... జిల్లాలో త‌న బ‌లాన్ని గుండుసున్నాకు త‌గ్గించుకుందన్న వాద‌న వినిపిస్తోంది.