Begin typing your search above and press return to search.

మంత్రుల నోటికి తాళం..కుటుంబరావుకి మైకు

By:  Tupaki Desk   |   23 Sep 2018 7:01 AM GMT
మంత్రుల నోటికి తాళం..కుటుంబరావుకి మైకు
X
చంద్రబాబు పాలన ఎవరికీ అంతుపట్టదు.. చివరకు సొంత కేబినెట్లోని మంత్రులు కూడా చంద్రబాబు చేసే పనులను అర్థం చేసుకోలేరు. ఇద్దరు సీనియర్ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లుగా వారిని తమ సొంత శాఖల్లో కూడా పనిచేయించుకోలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేశారు. ఇక మిగతా మంత్రుల్లో కొందరు తమ నోటి బలంతో ముందుకు దూసుకెళ్లినా కొన్నాళ్లుగా వారి నోళ్లకూ తాళాలు వేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు అప్పజెప్పేశారు చంద్రబాబు. దీంతో తమను కాదని చంద్రబాబు కుటుంబరావునే నెత్తికెక్కించుకుంటుండంతో మంత్రులు మండిపడుతున్నారట.

ప్ర‌భుత్వం త‌ర‌పున ఏ విధాన‌ప‌ర‌మైన అంశంపై మాట్లాడాల‌న్నా - ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇవ్వాలన్నా ఇపుడు అందరికీ క‌న‌బ‌డుతున్న‌ది కుటుంబ‌రావే. నిజానికి ఆయ‌న చేయాల్సిన ప‌నేంటంటే ఆర్ధిక‌ప‌ర‌మైన అంశాల‌పై రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి స‌ల‌హాలివ్వాలంతే. కానీ ఆయ‌న ఏం చేస్తున్నారంటే ప్ర‌తిప‌క్షాల‌పై మంత్రుల్లాగ‌ - తెలుగుదేశంపార్టీ నేత‌ల్లాగ ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో ఎదురుదాడికి దిగుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు స‌వాళ్ళు విసురుతున్నారు. పోల‌వ‌రం - ప‌ట్టిసీమ - రాజ‌ధాని నిర్మాణం..ఇలా అంశం ఏదైనా కావ‌చ్చు. అమరావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి బాండ్ల జారీ వ్య‌వ‌హారం కూడా కావ‌చ్చు. బాండ్ల జారీలో అవినీతి జ‌రిగింద‌ని ఎవ‌రైనా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ కుటుంబ‌రావు ఇటు వైసిపి - అటు బిజెపి నేత‌ల‌కు స‌వాల్ విసిరారు... దీంతో... కొందరు మంత్రులు కుటుంబరావుపై బాహాటంగానే మండిపడుతున్నారు.. తానేమైనా చంద్రబాబు అనుకుంటున్నారా... ఇలా రాజీనామా చేస్తానని సవాల్ విసురుతున్నారు.. ఆయనేమైనా ప్రజలతో ఎన్నికైన పదవిలో ఉన్నారా రాజీనామా చేస్తానని ఇతర పార్టీలవారికి సవాల్ విసరడానికి..? చంద్రబాబు ఇచ్చిన పదవిలో ఉన్నారని అంటున్నారు.