Begin typing your search above and press return to search.

బాబు... మీ తీరును లోకం గ‌మ‌నిస్తోంది

By:  Tupaki Desk   |   24 July 2017 5:24 AM GMT
బాబు... మీ తీరును లోకం గ‌మ‌నిస్తోంది
X
``అపరిష్కృత సమస్యలను శరవేగంగా పరిష్కరించాలి. రహదారుల విస్తరణ, కాలువల పూడిక‌లు తొల‌గించాలి. న‌దుల్లో ఆటంకాలు, ముళ్ల పొదలను పూర్తిస్థాయిలో తొలగించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. సాగునీరు అందించడానికి నిర్ధేశించిన సమయంలోగా కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసేలా కలెక్టర్ తరచూ సమీక్షించాలి. పెండింగ్ పనుల్లో వేగం పెంచాలి. ఇప్పటి వరకూ అధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉంది.`` అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం సంద‌ర్భంగా ఇది ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలు, అసంతృప్తి. ముఖ్య‌మంత్రి హోదాలో ఇలా ఆదేశాలు ఇవ్వాల్సిందే. సీఎం గారు అద్భుతంగా ప‌నిచేస్తున్నారు అని అనుకోకండి. బాబు గారి స‌మీక్ష‌లోని రెండో కోణాన్ని మ‌రికొంద‌రు విశ్లేషిస్తున్నారు.

ఇలా సీఎం చంద్రబాబు అధికారులకు సూచించింది మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌ల అభివృద్ధి విష‌యంలో కాదు.. కేవ‌లం నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించిన‌ సందర్భంగా! ఈ పాయింట్‌ పైనే ప‌లువురు తీవ్ర అభ్యంత‌రం చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గం గురించి ఇంత శ్ర‌ద్ధ తీసుకోవ‌డం ఏమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎమ్మెల్యే మ‌ర‌ణిండం వ‌ల్ల వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం ఇలా చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు కూడా. సాక్షాత్తు త‌న బావ‌మ‌రిది, పార్టీలో కీల‌క నేత అయిన ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ నియోజ‌క‌వ‌ర్గ‌మైన హిందూపురంలో స‌మ‌స్య‌లు తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే బాల‌య్య తీరును నిర‌సిస్తూ ఏకంగా దున్న‌పోతుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు, రోడ్డెక్కి నిర‌స‌న‌లు తెలిపిన‌ప్ప‌టికీ సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష జ‌ర‌ప‌లేదు. నంద్యాల‌లో వ‌లే అక్క‌డ ప‌ర్య‌టించ‌లేదు స‌రిక‌దా అధికారులకు ఆదేశాలు ఇవ్వ‌లేదని ప‌లువురు గుర్తుచేస్తున్నారు.

అయితే నంద్యాలలో మాత్రం ఉప ఎన్నిక‌లు ఉన్నాయ‌ని ఏకంగా ప‌ర్య‌టించ‌డం, అనంత‌రం అమరావ‌తి నుంచి నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధిపై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు. సీఎం చంద్రబాబు నంద్యాల‌లో చెప్పిన‌ట్లు తాను ఎన్నిక‌ల కోణంలో నంద్యాల అభివృద్ధి చేయ‌లేద‌నేది నిజం అయితే.... ఇదే రీతిలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి-సంక్షేమంపై ఎందుకు స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డంలేద‌ని ప‌లువురు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.