Begin typing your search above and press return to search.

మంత్రిపై త‌మ్ముళ్ల ఫైర్..బాబులో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   13 Jan 2018 4:15 PM GMT
మంత్రిపై త‌మ్ముళ్ల ఫైర్..బాబులో క‌ల‌క‌లం
X
మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య చీలిక‌ల‌కు కార‌ణ‌మయ్యేలా...పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీకి చెందిన‌ మంత్రి మాణిక్యాలరావు, టీడీపీకి చెందిన‌ జెడ్పీ చైర్మన్ బాపిరాజు మధ్య వివాదంపై తెలుగుదేశం పార్టీ ర‌థ‌సార‌థి - ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశమైన అనంత‌రం ఢిల్లీ నుంచి వచ్చిన వెంట‌నే ఆయ‌న ఈ వివాదంపై ఆరా తీశారు. ఆ వెంట‌నే పార్టీ నేత‌ల‌పై ఫైర్ అయ్యారు.

మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా చూస్తోందని, చేస్తున్న పనులను అడుగడుగునా అడ్డుకుంటోందని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడిన సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రికి ముఖ్య‌మంత్రి జీవో విడుదల చేసినా ఇక్కడ పనులు జరగనివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం చంద్రబాబు 2016లో విడుదల చేసిన 233 జీవో ద్వారా నియోజకవర్గంలోని 31 గ్రామాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ - సీసీ రోడ్ల ఏర్పాటుకు రూ.4 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఆ ప‌నులు ఇంకా పెండింగ్‌ లో పెట్టార‌ని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ అభివృద్ది పనులు జరిపేందుకు జిల్లా పరిషత్‌ లో తీర్మానం చేయాల్సి ఉండగా ఏడాదిన్నర కాలంగా దీనిని నిలుపుదల చేశారని ప‌రోక్షంగా జెడ్పీ చైర్మ‌న్‌ పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేకెత్తించిన నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు రంగంలోఇక దిగారు. జెడ్పీ చైర్మన్ - ఇతర టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఆరా తీసిన ఆయన.. బాపిరాజు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ వివాదంపై మంత్రులు పత్తిపాటి పుల్లారావు - కొల్లు రవీంద్రతో పాటు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో కమిటీని నియమించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

టీడీపీ నేత‌ల వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న టీడీపీ-బీజేపీ మిత్ర‌బంధాన్ని ప్ర‌భావితం చేసేలా మారుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో సానుకూల పరిణామాలు నెల‌కొంటుండ‌గా...దాన్ని చెడగొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని ఆదేశించిన‌ట్లు తెలుస్తున్న‌ది. బీజేపీ సీనియ‌ర్ నేత‌ - సాక్షాత్తు మంత్రుల్లో ఒక‌రిపై విమ‌ర్శ‌లు రావ‌డం ఇబ్బందిని క‌లిగిస్తుంద‌ని భావించినందువ‌ల్లే...ఇద్ద‌రు మంత్రుల‌తో క‌మిటీ వేశార‌ని అంటున్నారు.