Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఇష్యూలో బాబు అన్ని త‌ప్పులు చేశారా?

By:  Tupaki Desk   |   25 Oct 2016 10:30 AM GMT
ప‌వ‌న్ ఇష్యూలో బాబు అన్ని త‌ప్పులు చేశారా?
X
కోరి క‌ష్టాలు తెచ్చుకోవ‌టం కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. అలాంటి వారిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముందుంటారు. చేతిలో ఉన్న ఆయుధాన్ని వ‌దిలేసి.. లేని దాని కోసం త‌పించే ఆయ‌న తీరు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. విప‌క్ష నేత‌గా ఉన్న వేళ‌.. అంద‌రిని క‌లుపుకుపోవాల‌ని త‌పించే ఆయ‌న‌.. ప‌వ‌ర్‌ లోకి వ‌స్తే మాత్రం.. అంతా తానై ఉండాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ప‌దేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. మొద‌ట్లో ఆచితూచి అడుగులు వేసినా..త‌ర్వాతి కాలంలో మాత్రం ఆయ‌న త‌ప్పుల మీద త‌ప్పులు చే్స్తున్నార‌న్న మాట వినిపిస్తోంది. ఎన్నిక‌ల వేళ‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో జ‌త‌క‌ట్టి.. దాని లాభం పొందిన ఆయ‌న‌.. ప‌వ‌న్ తీరును పార్టీ నేత‌ల వ‌ద్ద ప‌దే ప‌దే పొగిడేసేవార‌ని చెబుతారు. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఆశించకుండా.. కేవ‌లం ఇచ్చిన మాట కోసం నిజాయితీగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ లాంటోళ్లు ఇప్ప‌టి రోజుల్లో చాలా అరుదుగా ఉంటార‌న్న మాట‌ను త‌న స‌న్నిహితుల వ‌ద్ద బాబు చెప్పిన‌ట్లుగా చెబుతారు.

మ‌రి.. అలాంటి నిజాయితీ ప‌రుడైన ప‌వ‌న్ ను కీల‌క విష‌యాల్లో భాగ‌స్వామ్యం చేయ‌టం.. వివాదాలు చెల‌రేగే అవ‌కాశం ఉన్న వేళ‌.. ఆయ‌న‌తో భేటీ కావ‌టం వ‌ల్ల వ‌చ్చే న‌ష్టం ఏమిటో అర్థంకాదు. ఎన్నిక‌ల‌వేళ‌.. జ‌త క‌ట్టే విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన బాబు.. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ప‌వ‌న్ స‌ల‌హాలు అడిగితే త‌ప్పేమిట‌న్న‌ది అర్థం కానిది. అధికారంలోకి వ‌చ్చిన కొంత‌కాలం వ‌ర‌కూ బాబు..ప‌వ‌న్ ల మ‌ధ్య ట‌ర్మ్స్ బాగానే ఉన్నా.. అమ‌రావ‌తి భూముల వ్య‌వ‌హారం విష‌యం ద‌గ్గ‌రికి వ‌చ్చేసరికి కాస్త తేడా కొట్ట‌టం తెలిసిందే. ఆ సంద‌ర్భంలో అమ‌రావ‌తిలోని కొన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. త‌న ఫీడ్ బ్యాక్‌ ను బాబుకు అందించేందుకు ఆయ‌న్ను క‌లిసిన‌ట్లు చెబుతారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు అంశంపై ప్ర‌భుత్వ వాద‌న ఏమిటి? ప‌వ‌న్ వాద‌న ఏమిట‌న్న విష‌యంపై ఇరువురు కాసేపు మాట్లాడుకొని.. ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చిన‌ట్లుగా చెబుతారు.

కానీ.. ఈ తీరు టీడీపీకి చెందిన కొంద‌రు సీనియ‌ర్ల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ని చెబుతారు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న బాబుకు..ప‌వ‌న్ ఫీడ్ బ్యాక్ ఇవ్వ‌టం ఏమిటి? సల‌హాలు..సూచ‌న‌లు ఇవ్వ‌టం ఏమిట‌న్న‌ప్ర‌శ్న‌ను ప‌లువురు వేసుకోవ‌టం క‌నిపించ‌టం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాలు ఇరువురి మ‌ధ్య‌కాస్తంత గ్యాప్ పెంచాయ‌ని చెప్పొచ్చు. ఇక‌.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు స్టాండ్ ఒక‌లా.. ప‌వ‌న్ స్టాండ్ మ‌రోలా మార‌టంతో ఈ అభిప్రాయబేధాల మ‌ధ్య‌దూరం బాగా పెరిగిన‌ట్లుగా చెప్పొచ్చు. ఇటీవ‌ల గోదావ‌రి మోగా ఆక్వాఫుడ్ పార్క్ ఉదంతంలో ఇది మ‌రింత పీక్ కి చేరుకొన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఇష్యూలో.. మ‌హిళ‌ల మీద.. సామాన్యుల మీద తీవ్ర‌మైన కేసుల్ని పోలీసులు పెట్టిన‌ట్లుగా త‌న దృష్టికి వ‌చ్చిన విష‌యాన్ని ప‌వ‌న్ ప్ర‌స్తావించినా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి స్పందించ‌ని వైనాన్ని ప‌లువురు గుర్తు చేస్తుంటారు.

ప్ర‌త్యేక హోదా అంశంపై తిరుప‌తి..కాకినాడ‌ల‌లో స‌భ‌లు ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌..త‌ర్వాత కామ్ అయిపోయార‌న్న మాట త‌ప్ప‌ని తేలుస్తూ.. అనంత‌పురం లో వ‌చ్చే నెల 10న భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు జ‌న‌సేన వెల్ల‌డించింది. ప్ర‌త్యేక హోదాకు బ‌దులు.. తాను సాధించిన ప్యాకేజీతో ఖుషీఖుషీగా ఉన్న చంద్ర‌బాబుకు.. హోదా విష‌యం మీద ప‌వ‌న్ పట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌టం న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

కానీ.. ప్ర‌త్యేక హోదా విష‌యం మీద కీల‌క నిర్ణ‌యం తీసుకునే స‌మ‌యంలో ప‌వ‌న్ తో భేటీ అయిన త‌ర్వాత బాబు.. ఒక అభిప్రాయానికి వ‌చ్చి ఉంటే బాగుండేద‌న్న వాద‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తారు. కొన్ని అంశాల మీద ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను త‌న‌తో క‌లుపుకున్న బాబు.. ప‌వ‌ర్ చేతిలోకి వ‌చ్చాక వ‌దిలేసిన తీరు ప‌వ‌న్ ను హ‌ర్ట్ చేసింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న మోడీ మాట నెర‌వేర్చేలా ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి.. కేంద్రం ఒత్తిడికి బాబు తలొగ్గటం ప‌వ‌న్ కు సుతారం ఇష్టం లేద‌ని చెబుతారు. త‌న మ‌న‌సులో ఇంత అసంతృప్తి ఉన్నా.. మిత్ర‌ధ‌ర్మాన్నిపాటించే క్ర‌మంలో భాగంగా బాబును ఒక్క‌మాట అంటే ఒక్క‌మాట కూడా అన‌ని వైనాన్ని ప‌లువురు గుర్తు చే్స్తుంటారు. కేంద్రం తీరునుతీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన ప‌వ‌న్ కు.. బాబును విమ‌ర్శించ‌టం పెద్ద విష‌యం కాదు. కానీ.. తొంద‌ర‌పాటు మంచిది కాద‌న్న ఉద్దేశంతో ప‌వ‌న్ ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లుగా చెబుతారు. ప‌వ‌న్ తీరు ఇలా ఉంటే.. ఆయ‌న విష‌యంలో బాబు మాత్రం త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్నార‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/