Begin typing your search above and press return to search.

బాబు మాట‌లు చూస్తే బాల‌య్య ఎంట్రీ ఇవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   19 Feb 2017 7:05 AM GMT
బాబు మాట‌లు చూస్తే బాల‌య్య ఎంట్రీ ఇవ్వాల్సిందే
X
ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత‌ చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా నేతలను హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణే తనకు ముఖ్యమని, అంద‌రినీ క‌లుపుకొని వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. తానే స‌ర్వం అని ఎవ‌రు అనుకోవ‌ద్ద‌ని, ద్వితియ శ్రేణి నాయ‌కుల‌ను గౌర‌వించాల‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ లుక‌లుక‌ల‌పై మీడియా ముందుకెళ్లి ఎవరైనా బహిరంగ విమర్శలు చేసినా, సభల్లో వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు తప్పవని ప‌రోక్షంగా బాల‌య్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉద‌హ‌రించారు. అనంత‌పురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన సంద‌ర్భంగా జిల్లాలోని పార్టీ నేతల్లో విభేదాలపై చంద్ర‌బాబు సీరియస్‌ అయ్యారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించే వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా బాల‌య్య పీఏ శేఖ‌ర్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నాయ‌ని టీడీపీ అనంత‌పురం జిల్లా వ‌ర్గాలు అంటున్నాయి.

కాగా, ఇదే స‌మ‌యంలో మిగ‌తా నేత‌ల‌కు సైతం త‌లంటిన‌ట్లు తెలిసింది. రాజధాని నిర్మాణం కోసం తాను కష్టపడుతుంటే, అనంతపురం జిల్లా నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులైన‌ పరిటాల సునీత - వరదాపురం సూరి - పార్థసారథి - నిమ్మల కిష్టప్ప విభేదాలను వీడి కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యే చాంద్‌ బాషా - కందికుంట ప్రసాద్‌ ల వ్యవహారంపై చంద్రబాబు మండిపడ్డారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరి జోక్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. గత ఎన్నికల్లో కలసికట్టుగా ఉండి పన్నెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీనే గెలింపించారని, రాబోయే రోజుల్లో అదే ఉత్సాహంతో పనిచేసి జిల్లా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్ర‌బాబు అన్నారు. జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. అనంతపురం అంటే తనకు ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నాయని పేర్కొంటూ భవిష్యత్‌ లో జిల్లా కోసం మరిన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/