Begin typing your search above and press return to search.

బాబు టీంలో ఇన్ ఎవరు? అవుట్ ఎవరు?

By:  Tupaki Desk   |   24 Feb 2017 3:30 AM GMT
బాబు టీంలో ఇన్ ఎవరు? అవుట్ ఎవరు?
X
నిన్నమొన్నటి వరకూ ఆచితూచి అడుగులు వేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. కొడుకు కెరీర్ ను ఒక కొలిక్కి తీసుకురావాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. పార్టీ వ్యవహారాలు చూసుకొమ్మంటే.. తన వారసుడ్ని.. ప్రజలకు సరిగా ప్రజంట్ చేయలేకపోయినట్లు అవుతుందన్న ఉద్దేశం ఉందని చెబుతున్నారు. దీనికి తోడు మరో చంద్రుడి వారసుడు చెలరేగిపోవటమే కాదు.. అంతర్జాతీయ వేదికల మీద వీర విహారం చేస్తూ.. తండ్రికి తగ్గ వారసుడి పేరును సొంతం చేసుకోవటం బాబుకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే. అందుకే కొడుకును మంత్రివర్గంలోకి తీసుకోవటం ద్వారా.. ఆయన సమర్థతను ప్రజలకు తెలిసేలా చేయటంతో పాటు.. రానున్న రెండేళ్ల వ్యవధిలో.. భావి అధినేతగా మార్చాలన్న తహతహ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.

గడిచిన మూడేళ్ల (రెండు మూడునెలలకు తక్కువగా) వ్యవధిలో మంత్రులుగా తమ సత్తా చాటని వారిపై వేటు వేయటం ద్వారా.. బాధ్యతల్ని సరిగా నిర్వర్తించని వారి విషయంలో వేటు తప్పదన్న సంకేతాన్ని ఇవ్వటం.. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించటంలో భాగంగా మంత్రివర్గ ప్రక్షాళనను మొదలెట్టాలని భావిస్తున్నారు. ఇందుకు మధ్యలో కొన్నిసార్లు కసరత్తు చేసినా.. వివిధ కారణాలతో ఈ ప్రక్రియను అమలు చేయలేదు.

కొడుకును మంత్రిని చేసే క్రమంలో కొద్దిమందిని తప్పించటం.. మరికొందరికి పదవులు ఇవ్వటం ద్వారా.. గతంలో తానిచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలన్న బాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పించాలి?ఎవరిని తీసుకోవాలన్న అంశంపై ఒక స్పష్టతకు చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి.. చినబాబుకు అధికారిక పట్టాభిషేకానికి ముహుర్తాన్ని ఎప్పుడు ఫిక్స్ చేశారన్న అంశంపై తాజాగా క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఉగాది రోజున కొత్త మార్పుల్ని చేసేందుకు బాబుసిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కానుంది. ఎన్నిక కాకుండానే మంత్రి పదవిని అప్పగించటం బాబుకు ఇష్టం లేదని.. ఎన్నిక ద్వారానే మంత్రి పదవిని అప్పగించామన్న భావన కలిగించేందుకు వీలుగా ఉగాదికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. మరి.. చినబాబుకు ఏ ఫోర్ట్ ఫోలియోను ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రి నారాయణ నిర్వహిస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖతో పాటు.. ఐటీ శాఖను ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం బాబు టీం నుంచి ఆరుగురికి ఉద్వాసన తప్పదని తేల్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ అంకె కూడా మారే అవకాశం ఉందని.. ఒకరిద్దరు పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో ఆరుగురు కంటే ఎక్కువ మందినే మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లగా చెబుతున్నారు. వేటు పడే అవకాశం ఉందని చెబుతున్న ఏడుగురు మంత్రులు ఎవరంటే..

1. అచ్చెన్నాయుడు

2. పల్లె రఘునాధరెడ్డి

3. రావెల కిషోర్ బాబు

4. పీతల సుజాత

5. పత్తిపాటి పుల్లారావు

6. మృణాళిని

మంత్రి వర్గంలోకి కొత్తగా వచ్చే అవకాశం ఉన్న నేతల్ని చూస్తే..

1. నారా లోకేశ్

2. మాగుంట శ్రీనవాసుల రెడ్డి

3. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

4. గొల్లపల్లి సుర్యారావు

5. మహ్మద్ జానీ

6. అఖిల ప్రియ

7. అమరనాథ్ రెడ్డి

8. సుజయ రంగారావు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/