Begin typing your search above and press return to search.

ఏపీలో ఎనిమిదిమందికి అదృష్టం

By:  Tupaki Desk   |   1 Dec 2015 4:27 PM GMT
ఏపీలో ఎనిమిదిమందికి అదృష్టం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను షురూ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప‌రిధిలోని ఎనిమిది కార్పోరేషన్ లకు చైర్మన్ లను ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా ప్రొ.వి.జయరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా వర్ల రామయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (బి.సి.) కోపరేటివ్ పైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా బి.రంగనాయకులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మల్లెల లింగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా ఎల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్‌గా పంచుమర్తి అనురాధ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్.సి.కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా జూపూడి ప్రబాకర్ రావు, కాపు సంక్షేమము మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా చలమల శెట్టి రామాజునయ్యలను నియమించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్ర‌క‌టించింది.

మొత్తంగా నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీలో తెలంగాణ‌లో జాప్యం జ‌రుగుతుండ‌గా ఏపీలో షురూ కావ‌డం ఆస‌క్తిక‌రం.