Begin typing your search above and press return to search.

త‌ల్లి.. పిల్ల కాంగ్రెస్‌ ల‌కు చంద్రుళ్ల శాప‌ముందా?

By:  Tupaki Desk   |   17 Jan 2019 7:33 AM GMT
త‌ల్లి.. పిల్ల కాంగ్రెస్‌ ల‌కు చంద్రుళ్ల శాప‌ముందా?
X
నోటి దాకా వ‌చ్చిన ముద్ద నోటికి చేరాలంటే యోగం ఉండాలి. మ‌ధ్య‌లో ఏదో ఒక‌టి వ‌చ్చి చేజారిపోవ‌టం అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుంటుంది. తాజాగా ఏపీ రాజ‌కీయాలు చూస్తుంటే.. అలాంటి ప‌రిస్థితి ఏపీ విప‌క్ష నేత విష‌యంలో జ‌ర‌గ‌నుందా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. క‌నుమ రోజున వైఎస్ జ‌గ‌న్ ను టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావ‌టం.. ఆయ‌నింట్లో లంచ్ చేయ‌టం తెలిసిందే.

తాజా ప‌రిణామాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో జ‌గ‌న్ పార్టీతో క‌లిసి ప‌ని చేసేందుకు కేసీఆర్ ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తున్న‌ట్లే. తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ల దూర్చిన చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ప‌క్కా అని ఫ‌లితాలు వెల్ల‌డైన రోజునే చెప్పిన కేసీఆర్ అందుకు త‌గ్గ‌ట్లే పావులు క‌దుపుతున్నారు. జ‌గ‌న్ ను అస‌రా చేసుకొని ఏపీ రాజ‌కీయాల్ని దిశానిర్దేశం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

మ‌రి.. ఈ ప‌థ‌కం వ‌ర్క్ వుట్ అవుతుందా? ఏపీ ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అవుతారు? అన్న‌ది ప్ర‌శ్న‌లుగా మారాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్పుడు కాంగ్రెస్ తో బాబు జ‌త క‌ట్ట‌టంపై ఎలాంటి ఆస‌క్తి వ్య‌క్త‌మైందో.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు కూడా ఇంచుమించు అలాంటి ఉత్సుక‌త‌నే రేపుతున్నాయి.

మ‌రి.. అంతిమ ఫ‌లితం తెలంగాణ‌లో ఎలా వ‌చ్చిందో.. ఏపీలో అలానే వ‌స్తే ప‌రిస్థితి ఏమిటి? అన్న ప్ర‌శ్న జ‌గ‌న్ వేసుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. ఇంత‌కాలం ఎవ‌రి అండ లేకుండా జ‌గ‌న్ ఒక్క‌డే త‌న స్వ‌శ‌క్తితో త‌న క్యాడ‌ర్ ను నిర్మించుకున్నారు. అంతులేని ప్ర‌జాభిమానాన్ని పొందారు.

సుదీర్ఘంగా సాగిన పాద‌యాత్రలో ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా.. వేలాదిగా ప్ర‌జ‌లు ఆయ‌న స‌భ‌ల‌కు హాజ‌రు కావ‌టం.. ఆయ‌న మాట‌లు వినేందుకు విర‌గ‌బ‌డి వ‌చ్చిన జ‌న‌సందోహానికి కేసీఆర్ తో క‌ల‌వ‌టంపై ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. ఇక్క‌డే ఒక పోలిక గుర్తుకు వ‌స్తోంది. తెలంగాణ‌లో త‌ల్లి కాంగ్రెస్ తో చంద్ర‌బాబు జ‌త క‌ట్టిన త‌ర్వాత నుంచి ఆ పార్టీ విజ‌య‌వ‌కాశాలు త‌గ్గిపోయాయి. అదే రీతిలో ఈ రోజున పిల్ల కాంగ్రెస్ గా చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో చంద్రుడైన కేసీఆర్ జ‌త క‌ల‌వ‌టం.. జ‌గ‌న్ వెనుక ఆయ‌న ఉండేలా జ‌రుగుతున్న ప్ర‌చార బిల్డ‌ప్ నేప‌థ్యంలో తెలంగాణ చంద్రుడి ప్ర‌భావం త‌న మీద ప‌డ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ కు ఉంది.

తానొక్క‌డే విజ‌యాన్ని చేజిక్కించుకోగ‌ల‌ర‌న్న అంచ‌నాలు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. తెలంగాణ చంద్రుడితో సంబంధాలు ప్ర‌స్తుతానికి అవ‌స‌రం లేనివిగా చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ చంద్రుడితో చెలిమి కంటే ఏపీ ప్ర‌జ‌ల భావోద్వేగాలు ముఖ్య‌మ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తిస్తే మంచిది. త‌న సొంత లాభం కోసం ఈ రోజు జ‌గ‌న్ చెంత‌కు చేరిన కేసీఆర్ అండ్ కో కార‌ణంగా జ‌గ‌న్ త‌న ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. లేని ప‌క్షంలో తల్లి కాంగ్రెస్‌ కు చంద్ర‌బాబుతో ఎలాంటి అనుభ‌వం ఎదురైందో.. పిల్ల కాంగ్రెస్‌ కు తెలంగాణ చంద్రుడితో అలాంటి అనుభ‌వం ఎద‌ర‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల్ని జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.