Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయుడు మళ్లీ అదే పాట!

By:  Tupaki Desk   |   23 Aug 2019 5:30 PM GMT
చంద్రబాబు నాయుడు మళ్లీ అదే పాట!
X
కృష్ణా నది వరదల అంశాన్ని చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని వరదలు ఈ సారి కృష్ణకు వచ్చాయని అంతా చెబుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడం సహజమే. దీంతో నది ఒడ్డున కట్టబడిన చంద్రబాబు నాయుడు ఇళ్లు కొంతమేర మునిగింది. అయితే ఈ విషయంలో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు.

అక్కడకూ చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం విషయంలో వివాదం ఉండనే ఉంది. అప్పటికే అది అక్రమ నిర్మాణం అని, నది ఒడ్డు మీద అలాంటి ఇళ్లు కట్టడం అక్రమమనే అభియోగాలున్నాయి. వాటన్నింటికీ చంద్రబాబు నాయుడు అసలే మాత్రం విలువను ఇవ్వడం లేదు. అదే ఇంట్లోనే కొనసాగుతూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో కృష్ణా నదికి భారీ వరద రావడం, వరద చంద్రబాబు నాయుడు ఇంటిని చుట్టుముట్టిన వైనం అందరికీ అర్థం అయ్యింది. అయితే అందుకు సంబంధించి ఫొటోలు తీయడం మీదే తెలుగుదేశం పార్టీ అతిగా స్పందించింది. వరద సన్నివేశాలను జనాలకు చూపించడం నేరం అన్నట్టుగా వ్యవహరించింది. తన ఇంటిని ముంచడానికే వరదలను సృష్టించారని చంద్రబాబు నాయుడు ఒక వాదన చేస్తూ ఉన్నారు.

ఆయన మళ్లీ అదే వాదననే కొనసాగించారు. అవి సహజమైన వరదలు అని, కృత్రిమ వరదలు అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. కావాలనే నీటిని ఒకేసారి వదిలారు అనేది చంద్రబాబు నాయుడు మోపుతున్న అభియోగం. అయితే చంద్రబాబు నాయుడు వాదనలో పస కనిపించడం లేదు.ఇప్పటికే అవి కావాలని సృష్టించిన వరదలు అని తెలుగుదేశం వాళ్లు అభాసుపాలయ్యారు. పడవను అడ్డుపెట్టి నదిని మళ్లించాలని చూశారని లోకేష్ ట్వీట్ చేయడం కామెడీగా మారింది. అయితే తెలుగుదేశం అధినేత మాత్రం మళ్లీ మళ్లీ అవేమాటలే మాట్లాడుతూ తన మీద సానుభూతిని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారని పరిశీలకులు అంటున్నారు.