పవన్ తో బాబు రహస్య మంతనాలు

Tue Feb 19 2019 10:55:19 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి కలసి వచ్చేలా లేవు. ఈ సారి విజయం దక్కదేమోననే అనుమానం చంద్రబాబు నాయుడిని వెంటాడుతోంది. గత ఎన్నికలలో కూడా ఇదే పరిస్దితి ఉన్నా చివిరి నిమిషంలో పవన్ కల్యాణ్ తోడవడంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడ పొత్తు కుదుర్చుకోవడం వల్ల చంద్రబాబు అధికారంలోకి రాగలిగేరు. నాలుగున్నరేళ్ల తెలుగుదేశం పాలనపై ప్రజలలో తీవ్ర అసంత్రుప్తి నెలకొందని వారు ప్రత్యామ్నయ పార్టీలను వెతుకుంటున్నారని చంద్రబాబు నాయుడికి వివిధ సర్వేల ద్వారా తెలిసింది. దీంతో గత ఎన్నికలలోనే అవసరమైన స్నేహం ఈ ఎన్నికలలో మరింత కావాలని ఆయన ఆశిస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంతంగా అధికారంలోకి రాకపోయిన ఇతరులను అధికారంలోకి తీసుకురావడానికైన అధికారం దూరం చేయడానికైన పనికి వస్తారని ప్రచారం ఉంది. దీంతో పవన్ కల్యాణ్ను తన మార్గంలోకి తేచ్చుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడిపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆయనను తనవైపు తిప్పుకోవడానికి ఏం చేయలా అని బాబు మధన పడుతున్నట్లు సమచారం.

గతంలో పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు గంటా శ్రీనివాస్ - నార‍యణ వంటి కాపు కులస్థులను మంతనాల కోసం పంపించారు. అయితే అవి ఫలించలేదు. దీంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు ఏ ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోయారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితులలో మార్పు రావడం పార్టీ నుంచి అనేక మంది నాయకులు వైఎస్ ఆర్ సీపీలో చేరడం తెలుగుదేశం ఓటమికి కారణం అవుతాయని చంద్రబాబు నాయుడు గ్రహించారు. దీంతో ఎలాగైన పవన్ కల్యాణ్ ను తమవైపు తిప్పుకోవడానికి చంద్రబాబునాయుడు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమలో అత్యంత దగ్గరైన వారి చేత ఒకరిద్దరి మీడియా అధిపతుల ద్వారా మాట్లాడించాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ పెద్ద దర్శకుడు - ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఒక అధిపతి పవన్ కల్యాణ్ తో తొలివిడత చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ చర్చలు ఫలిస్తే - డీల్ కుదిరితే మళ్లీ మరోసారి చంద్రబాబు - పవన్ కల్యాణ్ లు ఏకమయ్యే అవకాశం ఉంది.