Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో బాబు మాట్లాడుతార‌ట‌

By:  Tupaki Desk   |   27 Aug 2015 4:18 PM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో బాబు మాట్లాడుతార‌ట‌
X
ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వ‌డంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై అవసరమైతే పవన్ కళ్యాణ్‌తో కూడా మాట్లాడతానని చెప్పారు. విభజన విషయంలో జరిగిన అన్యాయన్ని త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్రధాని న‌రేంద్ర‌మోడీకి, నీతిఅయోగ్ ఉపాధ్యక్షుడికి వివరించినట్టు బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. విపక్షాలకు రాజకీయ ప్రయోజనాలు కావాలని మండిప‌డ్డారు.

విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు అన్యాయం చేసిన...చేస్తున్న వాళ్లను వదలనని బాబు స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఎవరూ అధైర్యపడొద్దని..అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఇంకా ఇంకా నష్టపోతామని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవినీతి విష‌యంలో త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసే వాళ్లు గ‌తం గుర్తుచేసుకోవాల‌ని కోరారు. YS రాజశేఖర్ రెడ్డి హయాంలో 25 కమిటీలు వేసిన త‌న‌ను ఏమిచేయలేకపోయారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం కుడి కాల్వను పూర్తిచేసి రాయలసీమకు నీరిస్తామని సీఎం ప్రకటించారు. ప‌ట్టిసీమ స‌హా ప్రాజెక్టుల‌న్నీ నిర్మాణాల‌న్నీ చేప‌డ‌తామ‌ని పున‌రుద్ఘాటించారు.

స‌మ‌స్య‌ల్లో నుంచే అవ‌కాశాలు వెతుక్కోవ‌డం తెలుగుదేశం పార్టీకి కొత్త‌కాద‌ని, భ‌విష్య‌త్తులోనూ ఈ విధంగా ముందుకువెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఏపీకి ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాల కోసం త‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డ‌బోమ‌ని చెప్పిన బాబు.. స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం మ‌రింత స‌మ‌యం త‌ప్ప‌క వేచి చూస్తామ‌ని తెలిపారు.
...