Begin typing your search above and press return to search.

అప్పు చేసి మ‌రీ ప‌సుపు కుంక‌మ ఇచ్చారా బాబు?

By:  Tupaki Desk   |   21 April 2019 5:16 AM GMT
అప్పు చేసి మ‌రీ ప‌సుపు కుంక‌మ ఇచ్చారా బాబు?
X
బాబు ఐదేళ్ల పాల‌న‌కు సంబంధించిన లెక్క‌లు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. విభ‌జ‌న త‌ర్వాత ఆర్థిక క‌ష్టాలు మీద ప‌డుతున్నా.. ఖ‌ర్చుల విష‌యంలో నియంత్ర‌ణ లేని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎడాపెడా ఖ‌ర్చుల్ని చేయ‌టం.. అందిన కాడికి అప్పులు చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి స‌రిగా లేన‌ప్పుడు ఖ‌ర్చుల్లో కోత పెట్టుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి. అందుకు భిన్నంగా ఆర్భాటంగా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌టం.. అందుకోసం భారీ ఎత్తున అప్పులు తీసుకోవ‌టం బాబుకు ఒక అల‌వాటుగా మారిన‌ట్లు చెబుతున్నారు. అధికారం చివ‌ర్లోకి వ‌చ్చిన వేళ‌.. ఇష్టారాజ్యంగా బాబు చేసిన అప్పుల లెక్క షాకింగ్ మారింది. కొత్త ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్ప‌త్తి ప్ర‌కారం 3 శాతం మేర బ‌డ్జెట్ లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.32వేల కోట్లు అప్పు చేసే వీలుంది. అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం చెప్పిన అప్పుల లెక్క‌కు కేంద్రం నో చెప్పింది.

నాలుగు నెల‌ల స్వ‌ల్ప వ్య‌వ‌ధికి ప్ర‌వేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించిన నేప‌థ్యంలో మార్కెట్ నుంచి రూ.8వేల కోట్లు అప్పు చేసేందుకు ఓకే చేసింది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ కు రెండు రోజులు ముందు ఈ నెల 9న రాష్ట్ర ప్ర‌భుత్వం సెక్యూరిటీల విక్ర‌యంతో ఓపెన్ మార్కెట్లో రూ.5వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పున‌కు 8.18శాతం వ‌డ్డీ చెల్లిస్తాన‌న్న హామీతో అప్పు చేయ‌టం గ‌మ‌నార్హం.

ఒకే నెల‌లో రూ.5వేల కోట్లు అప్పు చేయ‌టంతో రానున్న మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో కేవ‌లం రూ.3వేల కోట్లు మాత్ర‌మే అప్పు చేసే వీలుంది. ఇదిలా ఉంటే.. పోలింగ్ కు ముందు ప‌సుపుకుంకమ ప‌థ‌కం పేరుతో భారీ ఎత్తున నిధులు ఖ‌ర్చు చేసిన బాబు స‌ర్కారు..దాని ద్వారా ఏర్ప‌డే లోటును తాజా అప్పుతో పూడ్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అంటే.. వేరే అవ‌స‌రాల కోసం ఖ‌ర్చు చేయాల్సిన మొత్తాన్ని ముందు ప‌సుపుకుంక‌మ ప‌థ‌కానికి కేటాయించి.. త‌ర్వాత అప్పుగా నిధులు సమీక‌రించార‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌తున్నాయి. పోలింగ్ లో ఓట‌ర్ల మ‌నసు దోచుకోవ‌టానికి అప్పు చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీక‌ల్లోతు అప్పుల్లో మునిగి కూడా ప‌థ‌కాల పేరుతో చేస్తున్న ఖ‌ర్చున‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు? ప‌ప్పు బెల్లాల లెక్క‌న ఖ‌ర్చు చేస్తూ.. భారీ ఎత్తున చేసే అన్ని అప్పుల్ని రాష్ట్ర ప్ర‌జ‌ల నెత్తి మీద‌నే ఉంటుంద‌న్న చేదు నిజం అర్థ‌మైతే.. ఏపీ ప్ర‌జ‌ల్లో వ‌ణుకు గ్యారెంటీ.