Begin typing your search above and press return to search.

సీబీఐ నిషేధం వెనుక బాబు ప్లాన్ ఇదేనా.?

By:  Tupaki Desk   |   16 Nov 2018 6:11 AM GMT
సీబీఐ నిషేధం వెనుక బాబు ప్లాన్ ఇదేనా.?
X
సీబీఐ రాకను ఏపీలో నిషేధిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణమేంటన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. దీనివెనుక చాలా అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

వేల కోట్ల అవినీతి ఏపీలో జరుగుతోందని బీజేపీ నేత జీవిఎల్ లాంటి వారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సీపీబీఐ విచారణను కోరుతున్నారు. అంతేకాదు.. ఇటీవల విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు హైకోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దాడులు జరగవచ్చన్న అనుమానం చంద్రబాబుకు చాలా కాలంగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు సీబీఐ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సీబీఐని ఏపీలోకి రాకుండా నిషేధించినట్టు ప్రచారం జరుగుతోంది..

జగన్ పై హత్యాయత్నం జరిగాక చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. నిందితుడు శ్రీనివాస్ వెనుక ఎవరున్నారన్నది కనిపెట్టలేదు. అయినా సిట్ బాబు కనుసన్నల్లోనే నడిచి కేసు నీరుగారుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై హత్యాయత్నం కేసు హైకోర్టు కెక్కడం.. సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు సీబీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది.

హైకోర్టులో విచారణ సందర్భంగా ఎయిర్ పోర్టులో మూడు నెలలుగా సీసీ ఫుటేజీ లేదని ఏపీ పోలీసులు నివేదించడంపై కూడా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంత హైసెక్యూరిటీ జోన్ లో సీసీఫుటేజీ లేదనడంపై మండిపడింది. జగన్ పై దాడిని కప్పేయాలనే ఇలా చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో ఎలాగైనా సరే హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అందుకే బాబు అలెర్ట్ అయ్యి సీబీఐ ఏపీలోకి రాకూడదంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కానీ న్యాయనిపుణులు మాత్రం చంద్రబాబు వేసిన ఎత్తులు కోర్టుల ముందు నిలబడే అవకాశం లేదంటున్నారు.