Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్నర్‌ పై బాబు ఇలా ప‌గ తీర్చుకున్నాడా?

By:  Tupaki Desk   |   15 Jun 2018 5:57 PM GMT
గ‌వ‌ర్నర్‌ పై బాబు ఇలా ప‌గ తీర్చుకున్నాడా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడులో అస‌హ‌నం పెరిగిపోతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీలోని రాజ‌కీయ ప‌రిణామాల కార‌ణంగా ఇది స‌హ‌జ‌మే అయిన‌ప్పటికీ...ఆ ఆవేశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పై ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో గ‌త కొద్దికాలంగా త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన వారి విష‌యంలో చంద్ర‌బాబు అదును చూసి అస్త్రం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్తున్నారు. ఇదంతా ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను చంద్ర‌బాబు ప‌రోక్షంగా ఎదురుదాడి చేస్తున్న తీరు గురించే.

విష‌యంలోకి వెళితే...ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌తో భేటీ కోసం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్ గ‌త అయిదు రోజుల నుంచి గవర్నర్‌ ఇంటి వద్దే ధర్నా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌పై బాబు స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ చేస్తున్న పోరాటానికి ఏపీ సీఎం చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పనిచేయకుండా ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్‌ వ్యవస్థను వాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. తద్వారా కొద్దికాలం క్రితం గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థపై త‌ను అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంద‌ర్భాన్ని ప‌రోక్షంగా ఉటంకించారు.

కాగా, జాతీయ స్థాయి నాయ‌కుడి ఇమేజ్ పొందడంలో భాగంగా డిల్లీ ఎపిసోడ్‌పై చంద్ర‌బాబు స్పందించార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ర్టాల్లో గ‌వ‌ర్న‌ర్ ప‌నితీరుపై సీఎంలు అసంతృప్తి వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో త‌న‌దైన శైలిలో ఈ ప‌ర్వాన్ని సైతం త‌న ఇమేజ్‌ను నిర్మించుకునేందుకు బాబు ఉప‌యోగించుకున్నార‌ని అంటున్నారు.