Begin typing your search above and press return to search.

నెల రోజుల్లో రూ.370 కోట్ల పనులు చేయాలట

By:  Tupaki Desk   |   25 May 2016 9:12 AM GMT
నెల రోజుల్లో రూ.370 కోట్ల పనులు చేయాలట
X
ఏది ఏమైనా జూన్ చివరి నాటికి హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయాన్ని ఏపీ రాజధాని అమరావతికి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకు తగ్గట్లే యుద్ధప్రాతిపదికన ఏపీ సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో సెట్టింగుల మాదిరి.. భారీ భవనాల్ని రోజుల వ్యవధిలో పూర్తి చేయిస్తున్న బాబు సర్కారు తాజాగా రూ.370 కోట్లకు సంబంధించిన పనుల కోసం టెండర్లు పిలిచారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రూ.370 కోట్లలో రూ.250కోట్లను ఫర్నీచర్.. ఏసీలు.. విద్యుత్ తదితర సదుపాయాల కోసం వినియోగించాల్సి ఉంటుంది. మరో రూ.120 కోట్లను సచివాలయానికి అవసరమైన రోడ్లు.. మౌలిక వసతులు.. డ్రైనేజీ వసతి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ కేవలం 30 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలన్నది మరో కండీషన్.

జూన్ మూడో వారానికి పనులన్నీ పూర్తి చేసేసి హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని అమరావతికి తీసుకెళ్లాలంటే ఇంత యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిందే. అయితే.. ఇక్కడ సమస్య ఏమిటంటే.. ఇంత హడావుడితో పనులు పూర్తి చేసే క్రమంలో తప్పులు దొర్లటానికి..నిధులు పక్కదారి పట్టటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. మరి.. ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండటానికి బాబు సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే.. ఆరోపణలు చుట్టుముట్టటం ఖాయం. మరి.. ఈ పరీక్షలో బాబు ఎంత సక్సెస్ అవుతారో చూడాలి.