చంద్రబాబు కుటుంబంలో విషాదం..

Fri Dec 14 2018 13:46:09 GMT+0530 (IST)

ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు ఉదయ్ కుమార్ (43) గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతిచెందారు.హైదరాబాద్ లో నివాసముండే ఉదయ్ కుమార్ కు ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఉదయ్ కుమార్ స్వయానా చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు.. ఉదయ్ మరణించాడన్న వార్త తెలియగానే చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని తెలిసింది. వెంటనే అమరావతి నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు.

ఉదయ్ కుమార్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెల్లో నిర్వహిస్తారని తెలిసింది. రేపు ఉదయం ఆయన అంత్యక్రియలకు చంద్రబాబు హాజరుకానున్నారు.