Begin typing your search above and press return to search.

బీజేపీకి ప‌వ‌న్ కోవ‌ర్ట్.. ఇవాల్టి బాబు మాట ఇది

By:  Tupaki Desk   |   20 March 2018 9:54 AM GMT
బీజేపీకి ప‌వ‌న్ కోవ‌ర్ట్.. ఇవాల్టి బాబు మాట ఇది
X
నాలుగేళ్లుగా ద‌న్నుగా నిలిచి.. అదే తీరును ఐదో ఏడూ కంటిన్యూ చేసి..సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అండ‌గా నిలుస్తాడ‌నుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన వైనం బాబుకు బాగా హ‌ర్ట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. బాబు లోప‌లి మ‌రో బాబు నిద్ర లేచిన‌ట్లుగా క‌నిపిస్తోంది. జ‌న‌సేన అవిర్భావ స‌భ ఏర్పాటు చేసి త‌న‌పై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్ పై డైలీ బేసిస్ లో తిట్ల దండ‌కాన్ని వినిపిస్తున్న చంద్ర‌బాబు.. ఈ రోజు పొద్దున్నే సుదీర్ఘ టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ టెలీకాన్ఫెరెన్స్ లో ప‌వ‌న్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. ఆయ‌న గురించి త‌న‌కో కొత్త విష‌యం తెలిసిన‌ట్లుగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ కోవ‌ర్ట్ గా ప‌ని చేస్తున్నారంటూ తీవ్ర ఆరోప‌ణ చేశారు. బీజేపీకి కోవ‌ర్టుగా మారి.. టీడీపీ మీద బుర‌ద జ‌ల్ల‌ట‌మే ప‌వ‌న్ ప‌నిగా మారింద‌ని విమ‌ర్శించారు.

ఎప్పుడూ త‌న‌ను ఏదో ఒక విమ‌ర్శ చేసే జ‌గ‌న్ ను తాను ప‌ట్టించుకోన‌న్న బాబు.. నాలుగేళ్లుగా త‌న మిత్రుడిగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న కొడుకు అవినీతి కార‌ణంగా ప్ర‌ధాని మోడీ త‌న‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌టం లేద‌న్న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను తాను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లుగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

కొన్నేళ్ల క్రితం గోద్రా ఘ‌ట‌న‌ల సంద‌ర్భంగా తాను చేసిన వ్యాఖ్య‌ల్ని మోడీ గుర్తుంచుకుంటార‌ని తాను భావించ‌టం లేద‌న్న బాబు.. నాటి విమ‌ర్శ‌లు అప్ప‌టితోనే ప‌రిమిత‌మ‌ని.. ఆ లాజిక్ ఇప్పుడు ప‌ని చేయ‌ద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.హోదా విష‌యంపై నాలుగేళ్లుగా మోడీ స‌ర్కారు నాన పెట్టినా.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు సాహ‌సించ‌ని బాబు. ప‌వ‌న్ పై మాత్రం తీవ్ర‌స్థాయిలో మండిప‌డ‌టం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని త‌మ్ముళ్లంతా తిప్పి కొట్టాల‌న్న ఆదేశాన్ని ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌తంలో మోడీపై తాను చేసిన వ్యాఖ్య‌ల్ని గుర్తుంచుకొని మోడీ త‌న‌ను దూరం పెడుతున్నార‌నేలా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా బాబు ప‌రోక్షంగా చెప్ప‌టం విశేషం. లోకేశ్ అవినీతిపై ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉన్న‌ట్లుగా ప‌వ‌న్ చేసిన కామెంట్స్ ను టెలికాన్ఫ‌రెన్స్ లో బాబు ప్ర‌స్తావించారు.

ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఎవ‌రికి మేలు చేస్తాయ‌ని ప‌వ‌న్ భావిస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌న్న బాబు.. త‌న కుటుంబంపై నిరాధార‌న ఆరోప‌ణ‌లు చేసేలా ప‌వ‌న్ ఇంత డ్యామేజ్ చేస్తార‌ని తాను అనుకోలేద‌న్నారు.ప‌వ‌న్.. జ‌గ‌న్ లు ఇద్ద‌రూ బీజేపీకి కోవ‌ర్టులుగా ప‌ని చేస్తున్న‌ట్లుగా బాబు ఎంపీల‌తో చెప్ప‌టంతో పాటు.. ఒకే అబ‌ద్ధాన్ని  ప‌దే ప‌దే చెప్ప‌టం ద్వారా ప్ర‌జ‌ల్ని న‌మ్మించాల‌ని చూస్తున్న‌ట్లుగా బాబు వ్యాఖ్యానించారు. బాబు విమ‌ర్శ‌ల్ని బీజేపీ ఎంపీ హ‌రిబాబు మెచ్చుకోవటం వెనుక అంత‌ర్యం ఏమిటో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టులో అవినీతి ఉంద‌ని చెబుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. ధైర్యం ఉంటే ఆ ప్రాజెక్టు అవినీతిలో ఆధారాలు చూపించాల‌ని స‌వాల్ విసిరారు. ఇప్ప‌టిదాకా ప్రాజెక్టుల‌ను విపక్షం అడ్డుకుంటుంద‌ని.. ఇప్పుడు జ‌న‌సేన కూడా అడ్డుకోవ‌టం షురూ చేశార‌న్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులోనూ అవినీతి లేద‌ని.. తాను రాష్ట్రంలో అవినీతిని స‌హించే వ్య‌క్తిని కాద‌ని బాబు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ మీడియాలో గ‌తంలో ప్ర‌సార‌మైన మీడియా క‌థ‌నాల్ని ప‌వ‌న్ ప్ర‌స్తావిస్తున్నారంటూ త‌ప్పు ప‌ట్టారు. ఒక‌వేళ‌.. బాబుకు అంత కాన్ఫిడెన్సే ఉంటే.. త‌న ప్ర‌భుత్వం పైనా.. గ‌డిచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రపాల‌న‌పై  సీబీఐ విచార‌ణ‌ను బాబే స్వ‌యంగా కోరొచ్చు క‌దా? ప‌వ‌న్ ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్న ఆయ‌న‌..అందుకు భిన్నంగా త‌న స‌చ్ఛీల‌త‌ను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తే బాగుంటుంది క‌దా?