Begin typing your search above and press return to search.

మోడీపై చంద్ర‌బాబు ఫ్ర‌స్టేట‌య్యాడు

By:  Tupaki Desk   |   23 July 2016 4:58 PM GMT
మోడీపై చంద్ర‌బాబు ఫ్ర‌స్టేట‌య్యాడు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ తెలుగుదేశం.. కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ధ్య దూరం అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లే ఉంది. రాష్ట్రానికి సాయం చేసే విష‌యంలో కేంద్రం చూపుతున్న ఉదాసీన వైఖ‌రిపై చంద్ర‌బాబు నెమ్మ‌దిగా గ‌ళం విప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇంత‌కాలం ప్ర‌ధాని మోడీపై.. కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయొద్దంటూ పార్టీ నేత‌ల‌కు చెబుతూ వ‌చ్చిన చంద్ర‌బాబే.. ఇప్పుడు స్వ‌యంగా మోడీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చట్టబద్ధంగా రాష్ట్రానికి ద‌క్కాల్సిన వాటిలో కొన్నే వచ్చాయని ఆయ‌న అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్ర ప్ర‌భుత్వం ఏ ర‌కంగా అన్యాయం చేస్తోందో గ‌ణాంకాల‌తో స‌హా చంద్ర‌బాబు వివ‌రించారు. రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటు బ‌డ్జెట్లో ఉంద‌ని.. దాన్ని భ‌ర్తీ చేయాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం.. రూ. 4800 కోట్లు మాత్రమే ఇచ్చింద‌ని చంద్ర‌బాబు అన్నారు. సెంట్రల్ యూనివ‌ర్శిటీ.. గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామ‌న్న హామీలు నిల‌బెట్టుకోలేద‌ని.. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.800 కోట్లే ఇచ్చారని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. వెనకబడిన ప్రాంతాలకు రావలసిన నిధులూ ఇవ్వడం లేదని.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.. రాజధాని నిర్మాణానికి నిధులూ ఇవ్వడం లేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.