Begin typing your search above and press return to search.

క‌ర‌ణం బ‌ల‌రాంకు త‌ల బొప్పి క‌ట్టిందిగా!

By:  Tupaki Desk   |   23 Feb 2017 4:31 AM GMT
క‌ర‌ణం బ‌ల‌రాంకు త‌ల బొప్పి క‌ట్టిందిగా!
X
క‌ర‌ణం బ‌ల‌రాం... ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త. జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయ‌న పేరు తెలియ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో. ఆది నుంచి టీడీపీలోనే ఉన్న క‌ర‌ణంకు ఇటీవ‌లి కాలం ఏమాత్రం క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టికే త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అద్దంకిలో ఓ మారు తాను, మొన్న‌టి ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు ఓట‌మి చ‌విచూశారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో బ‌ల‌రాం కుమారుడు క‌ర‌ణం వెంక‌టేశ్‌ ను చిత్తుగా ఓడించిన గొట్టిపాటి ర‌వికుమార్‌... ఇటీవ‌లే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆది నుంచి క‌ర‌ణం - గొట్టిపాటి కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయ వైరం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో క‌ర‌ణం ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే చంద్ర‌బాబు... ర‌వికుమార్ ఎంట్రీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగానే క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఆ క‌థ‌నాలు నిజ‌మేన‌న్న‌ట్లుగా ర‌వికుమార్ టీడీపీలో చేరిన నాటి నుంచి అద్దంకిలోనే ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. ఒక‌రిని ఒక‌రు కొట్టుకునే దాకా కూడా ప‌రిస్థితి వెళ్లింది. వీరి గొడ‌వ‌ల‌ను శాంతింప‌జేసే య‌త్నం కూడా అధిష్టానం చేయ‌లేద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. చంద్ర‌బాబు నుంచి గట్టి హామీ తీసుకున్న త‌ర్వాతే... ర‌వికుమార్ సీనియ‌ర్ అయిన బ‌ల‌రాంతో ఢీకొట్టేందుకే సిద్ధ‌ప‌డ్డ‌ట్టు కూడా పుకార్లు వినిపించాయి. మొన్న‌టిదాకా ప్ర‌త్య‌క్షంగానే త‌ల‌ప‌డ్డ ఈ రెండు వ‌ర్గాలు ఇటీవ‌ల కాస్తంత శాంతించినా... ఎవ‌రి దారి వారిదే అన్న చందంగా వ్య‌వ‌హారాలు న‌డిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో జిల్లాల వారీగా టీడీపీ క‌మిటీల‌తో స‌మీక్ష‌లు చేస్తున్న చంద్ర‌బాబు... ప్ర‌కాశం జిల్లా క‌మిటీ స‌మావేశానికి ముందుగా... నిన్న విజ‌య‌వాడ‌లోని త‌న నివాసంలో క‌ర‌ణం - జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా క‌ర‌ణంకు చంద్ర‌బాబు గ‌ట్టిగానే వార్నింగు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన బ‌ల‌రాం... చంద్ర‌బాబు ఇచ్చిన వార్నింగును నేరుగా బ‌య‌ట‌పెట్ట‌కున్నా... ప‌రోక్షంగా త‌న‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు... అద్దంకి నియోజ‌కవ‌ర్గంపై ఆశ‌లు వ‌దులుకోవాల‌ని చంద్ర‌బాబు నేరుగానే బ‌ల‌రాంకు చెప్పార‌ట‌. ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటికే ఆ నియోజకవ‌ర్గాన్ని పూర్తి స్థాయిలో వ‌దిలేయాల్సిందేన‌ని కూడా బ‌ల‌రాంకు ఆదేశాలు జారీ చేశార‌ట‌. అంతేకాకుండా గొట్టిపాటితో వైరాన్ని తెంచుకోవాల‌ని, క‌లిసి ప‌నిచేయాల‌ని కూడా చెప్పార‌ట‌. పార్టీ ఆదేశాల‌లను ధిక్క‌రించే వారు ఎంత‌టివారైనా ఉపేక్షించేది లేద‌ని కూడా క‌ర‌ణం ముఖం మీదే చెప్పేశార‌ట‌. పార్టీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న మీరు ఎమ్మెల్సీగానో, లేదంటే దానికి త‌గ్గ ఏదేనీ ప‌ద‌వి ఇస్తాన‌ని, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభజ‌న‌లో అసెంబ్లీ సీట్లు పెరిగితే... క‌రణం వెంక‌టేశ్‌ కు మ‌రో చోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పార‌ట‌.

అధినేత త‌న ముఖం మీదే హెచ్చ‌రిక‌లు చేస్తూ... ప‌ద‌వుల కోసం వేచి చూడాల‌న్న కోణంలో మాట్లాడ‌టంతో బ‌ల‌రాం బాగానే ఇబ్బంది ప‌డ్డార‌ట‌. అంతేకాకుండా ఎప్ప‌టినుంచో త‌మ‌కు పెట్ట‌ని కోట‌లా ఉన్న అద్దంకిని వ‌దులుకోవాల‌ని చంద్ర‌బాబు చెప్ప‌డంతో బ‌ల‌రాం నిజంగానే షాక్ తిన్నార‌ట‌. అయితే చేసేదేమీ లేని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌న్నీ స‌వ‌వ‌దానంగా ఆల‌కించి, వాటికి త‌లాడించి బ‌ల‌రాం బ‌య‌ట‌కు వ‌చ్చార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/