Begin typing your search above and press return to search.

బాబు దృష్టిలో తప్పంతా కరణం బలరాందేనా?

By:  Tupaki Desk   |   25 May 2017 10:11 AM GMT
బాబు దృష్టిలో తప్పంతా కరణం బలరాందేనా?
X
క్రమశిక్షణకు మారుపేరని జబ్బలు చరుచుకునే తెలుగుదేశం పార్టీలో నేతలు కట్టు తప్పి కొట్లాటలకు, హత్యలకు తెగిస్తుండడంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫైర్ అవుతున్నారు. హద్దు మీరితే ఇక సహించబోనని బాబు పార్టీ నాయకులను హెచ్చరించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కరణం బలరాం - గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. కరణం బలరాం వ్యవహరశైలిని ఆయన తప్పుబట్టారు.

పార్టీ నేతల తీరు వల్ల విపక్షానికి అస్ర్టాలు అందిస్తున్నట్లు అవుతోందని బాబు అభిప్రాయపడ్డారు. కడప - కర్నూల్ - ప్రకాశం జిల్లాల నాయకుల మధ్య సమన్వయం ఏమాత్రం ఉండడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారుల పట్ల వ్యవహరించిన తీరు కూడ వివాదాస్పదం కావడంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు.

ప్రకాశం జిల్లా వేమవరంలో హత్యోదంతం తర్వాత కరణం బలరాం వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. ఒంగోలులో జరిగిన ఘర్షణలో కూడ ఆయన వైఖరిని తప్పుబట్టినట్టు సమాచారం. అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని తాను ఎంత చెప్పినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బలరాం కుమారుడికి ఒక సీటు కేటాయిస్తానని చెప్పారనని బాబు గుర్తుచేశారు. బలరాంకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన విషయాన్ని కూడ బాబు ప్రస్తావిస్తున్నారు. వారికి ఇవ్వాల్సింది ఇస్తూ అద్దంకి నియోజకవర్గాన్ని రవికుమార్ కు వదిలేయాలని స్పష్టత ఇచ్చినట్టు బాబు చెప్పారు. ఒంగోలు ఘటనపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని బాబు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/