Begin typing your search above and press return to search.

బీజేపీతో రాజీకి బాబు త‌హ‌త‌హ‌! కార‌ణ‌మేంటంటే!

By:  Tupaki Desk   |   23 March 2018 3:30 PM GMT
బీజేపీతో రాజీకి బాబు త‌హ‌త‌హ‌! కార‌ణ‌మేంటంటే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న పోరులో భాగంగా త‌న పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎంపీల‌తో కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఇప్పుడు స‌రికొత్త వ్యూహాల‌తో రంగంలోకి దిగిన‌ట్లుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియాతో పాటు న్యూట్ర‌ల్ మీడియాలో వ‌స్తున్న ప‌లు క‌థ‌నాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా ఈ కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌ను బాబు ఎందుకు చేయాల్సి వస్తోంద‌న్న విష‌యం కూడా ఇక్క‌డ ఆస‌క్తిక‌రంగానే మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఓ వైపు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రుల‌తో త‌న పార్టీకి చెందిన ఎంపీలు వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న వైనంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న చంద్ర‌బాబు.... ఈ వ్యూహం వెనుక మ‌రో లాభాన్ని ఆశించి ఆయ‌నే స్వ‌యంగా ఎంపీల‌ను కేంద్ర మంత్రుల వ‌ద్ద‌కు పంపుతున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌త్యేక హోదా పోరులో భాగంగా ఏకంగా ఎన్డీఏ కూటమి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన టీడీపీ... హోదా పోరును భుజానికెత్తుకుంది. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు - కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారు - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న చంద్ర‌బాబు... ప్ర‌జ‌ల్లో అగాథానాకి ప‌డిపోయిన త‌న ఇమేజీని పెంచుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి.

ప్ర‌త్యేక హోదా పేరెత్తితే జైల్లో పెడ‌తానంటూ గ‌తంలో వార్నింగులు ఇచ్చేసిన చంద్ర‌బాబు... ఇప్పుడు అదే ప్ర‌త్యేక హోదా కావాలంటున్న తీరుపై జ‌నం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే జ‌నంలోని ఈ భావ‌న‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని చంద్రబాబు... అస‌లు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం మొద‌లెట్టిన వ్య‌క్తిని తానేనంటూ సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీపై బీజేపీ నేత‌లు కూడా విరుచుకుప‌డ‌టం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే మొన్న విడుదలైన కాగ్ రిపోర్టును ఆధారం చేసుకుని టీడీపీ ప్ర‌భుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌ గా మారిపోయింద‌ని బీజేపీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. ప‌ట్టిసీమ‌లో జ‌రిగిన అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ అవినీతి కాకుండా చంద్ర‌బాబుకు ప్ర‌త్య‌క్ష పాత్ర ఉంద‌న్న ఓటుకు నోటు కేసు ఉండ‌నే ఉంది. ఇక చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేశ్ అవినీతిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మొత్తంగా టీడీపీపై ఇప్పుడు అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయ‌నే చెప్పాలి. అవినీతిని ఎంత‌మాత్రం స‌హించేది లేద‌న్న కోణంలో ముందుకు సాగుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... సీఎం స్థాయి వ్య‌క్తుల‌పై కూడా విచార‌ణ చేయాల్సిందేన‌న్న కోణంలో వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబులో కేసుల భ‌యం మొద‌లైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎక్క‌డ త‌న అవినీతిపై కేంద్రం కేసులు న‌మోదు చేస్తుందేమోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్న చంద్ర‌బాబు... ఎన్డీఏ కూట‌మి నుంచి బయ‌టికి వ‌చ్చినప్ప‌టికీ... బీజేపీతో మాట్లాడి రాజీ కుదిరేలా మంత్రాంగం ర‌చించాల‌ని ఆయ‌న త‌న పార్టీ ఎంపీల‌కు సూచించిన‌ట్లుగా స‌మాచారం. ఈ విష‌యంపై ఎక్క‌డ కూడా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న రాక‌పోయినా... నేటి త‌మ సంచిక‌ల్లో ఏపీ ప‌త్రిక‌ల‌ను చూస్తే...టీడీపీ భావ‌న ఇదేన‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.