Begin typing your search above and press return to search.

త‌న పాలన‌ ఇష్టం లేక‌పోతే రోడ్ల‌పై న‌డ‌వ‌ద్దంటున్న బాబు

By:  Tupaki Desk   |   22 Jun 2017 9:41 AM GMT
త‌న పాలన‌ ఇష్టం లేక‌పోతే రోడ్ల‌పై న‌డ‌వ‌ద్దంటున్న బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు ఇంకా చెప్పాలంటే హెచ్చ‌రిక‌లు చేశారు. ముప్పై ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న నాయ‌కుడిగా పేరున్న చంద్ర‌బాబు తాజాగా సామాన్య ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేశారు. నంద్యాలలో ఈరోజు ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా పార్టీ కార్యక‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డికి స్థానిక ప్ర‌జ‌లు వ‌చ్చి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ప్రయ‌త్నించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు కూడా అవాక్క‌య్యే కామెంట్లు చేసిన‌ట్లు స‌మాచారం.

ఆర్జీలు ఇస్తూ త‌మ ఆవేద‌న‌ను చెప్పుకొనేందుకు స్థానికులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా బాబు చిర్రుబుర్రులాడారు. త‌న వ‌ల్ల ల‌బ్ధిపొందుతున్న వారు త‌న‌కు ఓటు వేయ‌క‌పోతే ఎలా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న ప‌రిపాల‌న న‌చ్చ‌ని వారు తాను ఇచ్చే పెన్ష‌న్స్ తీసుకోవ‌ద్ద‌ని, త‌న పాల‌న‌లోని రోడ్ల‌పై న‌డ‌వ‌వ‌ద్ద‌ని హుకుం జారీ చేశారు. తనకు ఓట్లు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొంద‌రికి అవినీతి చేయ‌డం, ఆ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయ‌డం అల‌వాట‌ని ప‌రోక్షంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ గురించి విమ‌ర్శించిన చంద్ర‌బాబు తాను అలాంటి దానికి విరుద్ధ‌మ‌ని చెప్పారు. అలా గెలిచిన వాళ్లు తిరిగి అవినీతికి పాల్ప‌డుతార‌ని బాబు విశ్లేషించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇచ్చే స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ దానికి దూరంగా ఉన్న‌ట్లు వివ‌రించారు.

కాగా బాబు వంటి సీనియ‌ర్ నేత ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై హాజ‌రైన టీడీపీ నేత‌లు సైతం ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ప‌రిపాల‌కుడిగా, అందులోని సీనియ‌ర్ నాయ‌కుడిగా పేరున్న వ్య‌క్తి ఇలాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌డం ఏమిట‌ని పలువురు నేత‌లు చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/