Begin typing your search above and press return to search.

పాలనపై సర్వే లెక్కలు చెప్పిన బాబు

By:  Tupaki Desk   |   27 July 2016 7:30 AM GMT
పాలనపై సర్వే లెక్కలు చెప్పిన బాబు
X
తరచూ సర్వేలు జరిపించటం.. వాటిల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం.. తప్పు ఒప్పులను సమీక్షించుకోవటం లాంటి అంశాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతల పని తీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్న ఆయన.. పాలనపైన కూడా ఆయన సర్వేలు చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో చేయించిన సర్వేల్లో పాలన బాగున్నా.. అధికారుల పని తీరు సరిగా లేదని.. ఎమ్మెల్యేలకూ సరిగా మార్కులు పడలేదన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించటం తెలిసిందే.

తాజాగా ప్రభుత్వ శాఖ కార్యదర్శులు. శాఖాధిపతులతో చంద్రబాబు సుదీర్ఘ భేటీని చంద్రబాబు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు అంశాలకు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా తాను ఇటీవల చేయించిన సర్వే వివరాల్ని చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్న సచివాలయం ఏపీకి తరలి రావాలంటూ తాను తీసుకున్న నిర్ణయం వెనుక ప్రజామోదం ఉందన్న విషయాన్ని పరోక్షంగా చెబుతూ.. హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ఏపీకి తరలిరావాలని ఏపీలోని 74.7 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ పాలనపై తాను ఇటీవల చేయించిన సర్వే వివరాల్ని చంద్రబాబు వెల్లడించారు.

బాబు చెప్పిన సర్వే వివరాలు ఇవే..

= ప్రభుత్వ పాలన బాగుందని 87.1 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

= పౌరసరఫరాల శాఖ తీసుకొచ్చిన ఈపాస్ విధానం బాగుందని 44.7 శాతం మంది చెబుతున్నారు.

= సరుకుల పంపిణీలో అవినీతి ఉందని 3.3 శాతం మంది అభిప్రాయ పడుతున్నారు.

= పాలనలో అవినీతి తగ్గిందని 52 శాతం మంది చెప్పగా.. పెరిగిందని 24 శాతం మంది చెబుతున్నారు.

= రుణమాఫీ 63 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. 14.3శాతం మంది అసంతృప్తితో ఉన్నారు.

= రెవెన్యూలో 45శాతం.. పోలీస్ లో 13.7 శాతం.. మున్సిపల్ 9.4శాతం.. వైద్యం ఆరోగ్యం 7.5 వాతం.. అవినీతి పెరిగింది.

= తహసీల్దార్ల కంటే కూడా ఎంపీడీవోల్లోనే అవినీతి ఎక్కువగా ఉంది.

= ఇసుక విధానంపై 80 శాతం.. మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాపై 75.5 శాతం.. చంద్రన్న బీమాపై 74 శాతం హ్యాపీ.