Begin typing your search above and press return to search.

ఇంట్లో పిల్లి వీధిలో పులి..బాబు ఢిల్లీ టూర్‌

By:  Tupaki Desk   |   17 Jun 2018 5:33 PM GMT
ఇంట్లో పిల్లి వీధిలో పులి..బాబు ఢిల్లీ టూర్‌
X
``రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎదుటే తేల్చుకునేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ టచ్‌లో ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎంలతో ఫోన్‌ లో చంద్రబాబు మంతనాలు జరిపారు. దీంతో పాటు అజెండాతో పాటుగా రాష్ట్రాల వాదనను వినిపించే అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో పట్టుపట్టే యోచనలో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. అయితే దీనికి కేంద్రం అంగీకరించకపోతే సమావేశాన్ని బహిష్కరించే ఛాన్స్ ఉంది. స్థూలంగా మోడీ ఎదుటే చంద్రబాబు తేల్చుకోనున్నారు.`` ఇది నీతిఆయోగ్‌ లో పాల్గొనేందుకు ముందు ఏపీ సీఎం చంద్ర‌బాబు టూర్ గురించి ఆయ‌న పార్టీ నేతలు చెప్పిన మాట‌ - అనుకూల మీడియా చేసిన ప్ర‌చారం.

దీనికి త‌గ్గ‌ట్లే..చంద్ర‌బాబు క‌వ‌ర్ చేసిన‌ప్ప‌టికీ...భేటీలో అనూహ్య‌మైన ట్విస్ట్ చోటుచేసుకుంద‌ని అంటున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల నుంచి ప్రసంగించే అవ‌కాశాన్ని అక్ష‌ర‌క్ర‌మంలో ఆయా రాష్ర్టాల సీఎంల‌కు అందించ‌గా ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. భూసేకరణ - పునరావాసానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి నిధుల కొరతను కేంద్రం తీర్చాలని కోరారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేయాలని తెలిపారు. ఇలా చంద్రబాబు ఏడు నిమిషాల పాటు చంద్రబాబు ప్రసంగించిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్... ఏపీ సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు... ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, సమస్యల తీవ్రత దృష్ట్యా మాట్లాడేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. మొత్తంగా 20 నిమిషాల పాటు నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ఈ స‌మావేశం ప్రారంభం స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో క‌ర‌చాల‌నం చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సిద్ధ‌ప‌డ‌లేదు. అయితే అనంత‌రం ఆయ‌న ప్ర‌ధానితో చేయి క‌ల‌పాల్సి వ‌చ్చింది. నీతిఆయోగ్ భేటీ మ‌ధ్య‌లో సీఎంలు చంద్ర‌బాబు - కుమార‌స్వామి - పిన‌ర‌యి విజ‌య‌న్‌ లు ముచ్చ‌టిస్తుండ‌గా వారి వ‌ద్ద‌కు ప్ర‌ధాని మోడీ వ‌చ్చి వారితో చేయిక‌లిపారు. దీంతో అదే స‌మ‌యంలో చేయిక‌ల‌ప‌డం కూడా చంద్ర‌బాబుకు త‌ప్ప‌నిస‌రి అయింది. కాగా, చంద్ర‌బాబు ఢిల్లీ టూర్‌పై బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు సెటైర్ వేశారు. `నీతి ఆయోగ్ సమావేశం గురించి మీడియాలో టీడీపీ అసత్యాల ప్రచారం చేస్తోంది. ప్రతి సీఎం కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు. ముఖ్యమంత్రి నాయుడు 12 నిమిషాలు మాట్లాడారు. సీఎం ఘర్షణ విధానాన్ని అనుసరించలేదు. టీడీపీ తప్పుడు ప్రచారం పూర్తిగా ఈ చిత్రాల ద్వారా బహిర్గతం అవుతోంది`` అంటూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ``ఇంట్లో పిల్లి వీధిలో పులి అంటే ఇదేనా!`` అంటూ సెటైర్ వేశారు.