Begin typing your search above and press return to search.

కోదండ‌రాంకు ఇన్విటేష‌న్ పంపిన బాబు

By:  Tupaki Desk   |   23 April 2019 4:54 AM GMT
కోదండ‌రాంకు ఇన్విటేష‌న్ పంపిన బాబు
X
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వ‌న్న మాట టీజేఎస్ పార్టీ అధినేత‌.. తెలంగాణ ఉద్య‌మ యోధుడు కోదండం మాష్టారిని చూసినంత‌నే అనిపించ‌క మాన‌దు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో భాగంగా జ‌రిగిన ఉద్య‌మంలో ఆయ‌న ప్ర‌స్తావ‌న రాకుండా రోజు గ‌డిచేది కాదు. ఒక ద‌శ‌లో కేసీఆర్ కు మించిన క్రెడిబిలిటీ.. తెలంగాణ ఉద్య‌మం ప‌ట్ల క‌మిట్ మెంట్ ఉన్న నేత‌గా ఆయ‌న పేరు మారుమోగేది. కేసీఆర్ కు రాజ‌కీయ ప‌రిమితులు ఉంటే.. కోదండం మాష్టారికి ఉద్య‌మ నేత‌గా అలాంటివేమీ ఉండేవి కావు.

దీంతో.. ఉద్య‌మం ఎక్క‌డ జ‌రిగినా.. కోదండం మాష్టారు అక్క‌డ ఉండేవారు. అలాంటి ప‌వ‌ర్ ఫుల్ కోదండం ఈ రోజున ప‌రిస్థితి ఏమిటోప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కోదండం మాష్టారి పార్టీ ఒక్క సీటులోనూ గెల‌వ‌లేని దుస్థితి. ఈ రోజున తెలంగాణ రాజ‌కీయాల్లో కోదండం పార్టీని ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి వేళ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నుంచి వ‌చ్చిన ఒక ఇన్విటేష‌న్ కోదండం మాష్టారికి కాస్తంత ఊర‌ట ఇస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ రోజు (మంగ‌ళ‌వారం) ముంబ‌యిలో అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈవీఎంలు.. వీవీ ప్యాడ్స్ పై జ‌ర‌గ‌నున్న చ‌ర్చ‌కు రావాల్సిందిగా కోదండం మాష్టారికి ఇన్విటేష‌న్ పంపారు చంద్ర‌బాబు. ఈ స‌మావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల ప్ర‌తినిధులు హాజ‌రుకానున్నారు. ఈ మీటింగ్ కు రావాల‌న్న చంద్ర‌బాబు ఆహ్వానంతో కోదండం మాష్టారు వారి పార్టీకి చెందిన అధికార ప్ర‌తినిధి యోగేశ్వ‌ర‌రెడ్డి ముంబ‌యికి వెళ్లారు. పేరుకు పార్టీ అధినేతే కానీ.. ఎవ‌రూ ప‌ట్టించుకోని వేళ‌.. కోదండం మాష్టారిని గుర్తిస్తూ.. వివిధ రాజ‌కీయ పార్టీలు పాల్గొనే వేదికలో కోదండం మాష్టారు పాలు పంచుకునేలా బాబు చొర‌వ తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.