Begin typing your search above and press return to search.

చేతులెత్తేసిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   23 Jan 2017 10:31 AM GMT
చేతులెత్తేసిన చంద్రబాబు
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు ఉద్యమం ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో ప్రెజర్ పెంచుతోంది. అయితే.. ఆయన మాత్రం ఏమాత్రం సిగ్గు - మొహమాటం లేకుండా ముందే దాన్ని ఖండించేస్తున్నారు. ఎవరెంత ప్రెజర్ చేసినా తాను మాత్రం చలించబోనని ఇండికేషన్ ఇచ్చేశారు. అసలు జల్లికట్టుకు ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధేమంటని ప్రశ్నిస్తున్నారు. తమిళులు ఏం చేస్తే చేసుకోనీ.. మనకెందుకు? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న‌ జ‌ల్లిక‌ట్టు ఉద్యమంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాకు పోలిక ఏమిటో తనకు అర్థం కావ‌ట్లేదని చంద్రబాబు తాజాగా అనడమే దానికి ఉదాహరణ.

జల్లికట్టు పోరాటం నేపథ్యంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పలువురు వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దావోస్‌ లో నిర్వ‌హించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయ‌న‌ ఈ రోజు అమ‌రావ‌తితో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధే త‌న‌కు ముఖ్య‌మని - కేంద్ర ప్ర‌భుత్వంతో గొడ‌వ‌లు పెట్టుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన‌వారే త‌న‌కు ఇప్పుడు ప‌లు లేఖ‌లు రాస్తుండ‌డం త‌న‌కు విచిత్రంగా అనిపిస్తోంద‌ని చంద్రబాబు అన్నారు.

తాను రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు - భ‌విష్య‌త్తు విష‌యంలో రాజీప‌డ‌బోన‌ని త‌న‌పై న‌మ్మ‌కం ఉంచే ప్ర‌జ‌లు త‌న‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్టార‌ని దానిని నిల‌బెట్టుకుంటున్నాన‌ని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప‌నులు జ‌ర‌గ‌కుండా ఉన్న పోల‌వ‌రం క‌ల సాధ్య‌మ‌వుతుంద‌ని కదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్య‌మని అన్నారు. కులాలు ప్రాంతాలు మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్ట‌డం కొంద‌రికి అల‌వాటుగా మారిపోయిందని అన్నారు. విశాఖ‌ప‌ట్నానికి భ‌విష్య‌త్తు ఉందా? అనే అనుమానాలు ఉన్న స‌మ‌యంలో ఆ న‌గ‌రాన్ని ఒక సుంద‌ర‌మైన న‌గ‌రంగా తీర్చిదిద్దుతున్నామ‌ని చెప్పారు. మరి.. ఇన్ని చేస్తున్న చంద్రన్న ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మౌనం దాల్చుతున్నారో.. పొరుగు రాష్ట్ర ప్రజలను చూసి కూడా ఎందుకు చలించడం లేదో ఆయనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/