దుబాయ్ లో ఉన్నప్పటికీ బాబు అలర్ట్ అయ్యారు

Sun Oct 22 2017 23:18:12 GMT+0530 (IST)

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యే పరిణామం మరోమలుపు తిరిగింది. ఇన్నాళ్లు ఆ పార్టీలోని ముఖ్య నేతలు - ద్వితీయ శ్రేణి నాయకులు స్పందించగా...తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. విదేశీ పర్యటనలో భాగంగా దుబాయిలో పర్యటిస్తున్న చంద్రబాబు స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వాకబు చేశారు.తెలంగాణ టీడీపీలోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం దుబాయ్ లో ఉన్న బాబు...ఎల్.రమణతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజకీయ పరిణామాలపై స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని బాబు దృష్టికి రమణ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారని అంటున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం..బాబు ఫోన్ తో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
టీడీపీ సీనియర్ నేతలకు బాబుతో జరిపిన సంభాషణల సారాంశాన్ని వివరించారు.

పార్టీ కార్యకర్తలెవరూ జరుగుతున్న పరిణామాలను చూసి కలవరపాటుకు గురికావాల్సిన అసవరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారని వివరించినట్లు సమాచారం. 24వ తేదీన జరిగే రాష్ట్ర సమావేశంలో బాబు దిశా..దశ నిర్ధేశం చేస్తారని..అందరూ ధైర్యంగా ఉండాలని రమణ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాస్ లోగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలని టీడీపీ నేతలు అంటున్నారు.