Begin typing your search above and press return to search.

బిగ్ జోక్‌.. బాబు ఎన్నిక‌ల‌ను రాజ‌కీయంగా చూడ‌ర‌ట‌

By:  Tupaki Desk   |   20 Sep 2017 6:14 AM GMT
బిగ్ జోక్‌.. బాబు ఎన్నిక‌ల‌ను రాజ‌కీయంగా చూడ‌ర‌ట‌
X
`వినేవాడు వీపీ అయితే.. చెప్పేవాడు చిరంజీవి అయిపోతాడ‌`న్న సామెత‌ను ఏపీకి సీఎం, టీడీపీకి అధినేత అయిన చంద్ర‌బాబు అక్ష‌రాలా నిరూపించారు. మంగ‌ళ‌వారం నంద్యాల‌లో జ‌రిగిన మీటింగ్‌లో మాట్లాడిన ఆయ‌న తానేం చెప్పినా జ‌నాలు న‌మ్మేస్తార‌నుకున్నారో ఏమో.. జ‌నాల చెవుల్లో కాబేజీల‌ను తొడిగేశారు. లేనిది ఉన్న‌ట్టు.. జ‌రిగింది కూడా జ‌ర‌గ‌న‌ట్టు భ‌లేగా డ‌ప్పుకొట్టుకున్నారు. విష‌యంలోకి వెళ్తే.. బాబు ఎప్పుడూ ఎన్నిక‌ల‌ను రాజ‌కీయ కోణంలో చూడ‌లేదట‌! నిశ్వార్థంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నేది త‌న సిద్ధాంత‌మ‌ట‌. ఎన్నిక‌ల్లో ఒక‌రిని ఒక‌రు తిట్టుకోవ‌డం కూడా త‌న‌కు న‌చ్చ‌ద‌ట‌. అందుకే ఆయ‌న ఎన్నిక‌ల్లో ఎప్పుడూ రాజ‌కీయాలు చేసిందే లేద‌ట‌!!

ఇంత‌కీ బాబు ఏమ‌న్నారో ఆయ‌న మాటల్లోనే.. ``నంద్యాల ఉప ఎన్నికలో ప్రజల సహకారం నా జీవితంలో మరిచిపోలేను. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తాను. నంద్యాలలో అందరికీ ఇళ్లు త్వరలోనే సాకారం అవుతాయి. నేనెప్పుడూ ఏ ఎన్నికల్నీ రాజకీయ కోణంలో చూడటం లేదు.`` అని అన్నారు. ఈ కామెంట్ల‌పై టీడీపీ నేత‌లు, మంత్రులు చంక‌లు గుద్దుకున్నారేమో కానీ, బాబు గురించి తెలిన వాళ్లు మాత్రం ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేసుకున్నారు. బాబు.. ఇంత కుళ్లు జోక్ పేలుస్తార‌ని ఊహించ‌లేద‌ని కూడా కామెంట్లు కుమ్మ‌రించారు.

నిజానికి నంద్యాల‌లో వైసీపీ నేత‌ల‌పైనా, ఆ పార్టీ అధినేత‌పైనా చంద్ర‌బాబు అండ్ టీం ఎంత‌గా విరుచుకుప‌డిందో అంద‌రికీ తెలిసిందే. ఇక‌, కాకినాడ‌లో అయితే, మ‌రింత‌గా ఫైర‌య్యారు. రాజ‌కీయ కోణంలోనే నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న విడుదల కాకుండా కోట్ల‌కు కోట్లు అభివృద్ధి పేరుతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కుమ్మ‌రించిన విష‌యం ఎవ‌రికి తెలియ‌దు? వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్పిన‌ట్టు.. వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌క‌పోయి ఉంటే.. బాబు క‌న్నెత్తి అయినా అభివృద్ధిపై దృష్టి పెట్టేవారా? ఇక‌, నిన్న‌టికి నిన్న నంద్యాల‌లో బాబు ఎలా గెలిచారో.. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వివ‌రించారు. ఒక్కొక్క డ్వాక్రా మ‌హిళ ఖాతాలోనూ రూ.4 వేల చొప్పున వేసిన విష‌యాన్ని ఆధారాల‌తో స‌హా ఉండ‌వ‌ల్లి... బాబు బండారం కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మ‌రి ఇదంతా రాజ‌కీయం కాదా? ఎన్నిక‌లను రాజ‌కీయం చేయ‌డం కాదా? బాబు ఎవ‌రి చెవిలో పూలు పెడ‌తారు?