Begin typing your search above and press return to search.

బాబు కులం లెక్క‌లు తెలంగాణ‌లో అట్ట‌ర్‌ ప్లాపేనా?

By:  Tupaki Desk   |   23 Oct 2018 5:30 PM GMT
బాబు కులం లెక్క‌లు తెలంగాణ‌లో అట్ట‌ర్‌ ప్లాపేనా?
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో `త‌ప్పుట‌డుగులు`వేస్తున్నారా? రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరున్న చంద్ర‌బాబు త‌న‌కు అచ్చివ‌చ్చిన లెక్క‌ల‌ల‌ను డిటోగా తెలంగాణ‌లో అమ‌లు చేయ‌బోవ‌డం ద్వారా త‌నంతతానుగా న‌ష్టం చేకూర్చుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు పార్టీ నేత‌లు తెర‌మీద‌కు తెచ్చిన ``ఆంధ్రా క‌మ్మ‌వారి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి` అనే పాయింట్ కేంద్రంగా ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.

టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల త‌రుణంలో మ‌రోమారు సీమాంధ్ర ప్ర‌స్తావ‌న‌ను తెర‌మీద‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రామూలాలున్న వారు చంద్ర‌బాబుకు & టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఆపేయాల‌ని - అస‌లు ఆంధ్రాబాబును ఎందుకు ఆద‌రించాల‌ని ప్ర‌శ్నించారు. అయితే, దీని ఆధారంగా టీడీపీ కొత్త ప్ర‌చారం మొద‌లుపెట్టింది. బాబును విమ‌ర్శిస్తే ఏపీలో కీల‌క‌మైన సామాజిక‌వ‌ర్గ‌మైన క‌మ్మ‌వారిని త‌ప్పుప‌ట్టిన‌ట్లేన‌ని అందుకే కేసీఆర్ ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని టీడీపీకి చెందిన సానుభూతిప‌రులు స‌మాచారం చేర‌వేస్తున్న‌ట్లు చెప్తున్నారు. త‌ద్వారా టీఆర్ ఎస్‌ కు త‌మ స‌త్తా ఏంటో చాటాల‌ని చూస్తున్న‌ట్లు వివ‌రిస్తున్నారు. అయితే ఇది టీడీపీ చేసుకుంటున్న సెల్ఫ్‌ గోల్ అని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

హైద‌రాబాద్ స‌హా తెలంగాణలో నివ‌సిస్తున్న సీమాంధ్రుల్లో క‌మ్మ‌వారి శాతం ఎక్కువే ఉన్న‌ప్ప‌టికీ...వారి ఓట్లు మాత్ర‌మే టీడీపీకి అండ‌గా లేవనేది నిజం. ఆంధ్రా మూలాలున్న మిగ‌తా కులాల వారు సైతం టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో కేవ‌లం ఒకే సామాజిక‌వ‌ర్గానికి టీడీపీని ప‌రిమితం చేయ‌డం వ‌ల్ల వారికే న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. బ‌దులుగా తెలంగాణ‌లోని సీమాంధ్ర మూలాలున్న‌ వారంద‌రినీ పార్టీ ప‌ట్ల జ‌రుగుతున్న ఎదురుదాడిని - ప్రాంతీయ‌త కార‌ణంగా వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ తెలియ‌జెప్పితే అధి ఫ‌లితం ఇవ్వ‌వ‌చ్చ‌ని చెప్తున్నారు. ఈ విష‌యం టీడీపీ గ్ర‌హిస్తే మేల‌ని లేదంటే...త‌మ‌ని తాము బుక్ చేసుకున్న‌ట్లేన‌ని స‌ద‌రు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.