Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తీరుపై బాబు ఇబ్బంది ప‌డుతున్నారా?

By:  Tupaki Desk   |   10 Dec 2017 8:32 AM GMT
ప‌వ‌న్ తీరుపై బాబు ఇబ్బంది ప‌డుతున్నారా?
X
`నేను అసెంబ్లీ వేదిక‌గా ఇచ్చిన వివ‌రాలే...పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో పూర్తి అధికారిక‌ స‌మాచారం. వీట‌న్నింటికంటే...మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా శ్వేత‌ప‌త్రం ఎందుకు?అలాంటి అవ‌స‌రం ఏముంది?` ఇది ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్య‌లు. ఎవ‌రిని ఉద్దేశించి చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌న మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన స‌మ‌యంలో డిమాండ్ చేయ‌డంతో టీడీపీ ర‌థ‌సార‌థి ఈ కామెంట్లు చేశార‌ని అంటున్నారు. ప‌వ‌న్ ప‌ట్ల సీఎం చంద్ర‌బాబుకు క‌లుగుతున్న ఒక‌ర‌క‌మైన చికాకుకు ఇదో ఉదాహ‌ర‌ణ అని అంటున్నారు.

ఏపీ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అమ‌రావ‌తి విష‌యంలో కూడా గ‌తంలో ప‌వ‌న్ ప‌లు ర‌కాల కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆనాటి రాజధాని పర్యటన మొదలు నిన్నటి పోలవరం ప్రాజెక్టు పర్యటన వరకు పవన్ కళ్యాణ్...ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. పోలవరం విషయంలో ఓ అడుగు ముందుకేసి.. ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోందని, లెక్క చెప్పాలని అడుగుతోందని, చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకుంటే లెక్కలు చెప్పవచ్చుగా అని నిలదీశారు. అయితే ప‌వ‌న్ ఈ కామెంట్లు చేసిన సంద‌ర్భాన్ని టీడీపీ నేత‌లు విశ్లేషిస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతుంటే...ద‌నికి తోడుగా ప‌వ‌న్ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న చేసి మ‌రీ త‌మ‌ను ఇబ్బంది పాలు చేసేలా కామెంట్లు చేయ‌డం ఏమిట‌ని ఇటు చంద్ర‌బాబులో అటు టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం మొద‌లైంద‌ని చెప్తున్నారు.

ఇదే స‌మ‌యంలో...ప‌వ‌న్ వ‌ల్ల క‌లుగుతున్న ప‌రోక్ష న‌ష్టాన్ని కూడా టీడీపీ నేత‌లు విశ్లేషిస్తున్నారు. మూడేళ్లుగా ఆయన పలు సందర్భాల్లో బయటకు వచ్చారు. ఆరు నెలలకు ఓసారి అన్నట్లుగా వస్తూ...అప్పుడు టీడీపీ స‌ర్కారు తీరుపై మండిప‌డటం...ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన వైసీపీకి అస్త్రంగా మారింద‌ని టీడీపీ శ్రేణులు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నాయి. స‌హజంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలు చేసే విమర్శలపై టీడీపీ ప‌రంగా ఎదురుదాడి చేస్తున్నామ‌ని అయితే..మిత‌ప్ర‌క్షంగా ఉన్న జ‌న‌సేన విమ‌ర్శ‌ల‌కు ఎలాంటి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల‌నే అంశంలో వారు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు త‌న‌కు కులం అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌ని ప‌వ‌న్ చేస్తున్న కామెంట్ల‌పైనా...టీడీపీ నేత‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. పవన్ కులానికి దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన వల్ల యువత, కాపు ఓట్లు దక్కుతాయని టీడీపీ భావిస్తోంది. తనను ఒక్క కులానికి ఆపాదించవద్దని పదేపదే చెబుతుండ‌టం పార్టీ నేత‌ల‌ను మ‌థ‌నంలో ప‌డేస్తోంది.

తన నాలుగు రోజుల పర్యటనలో టీడీపీకి గట్టి వార్నింగ్ ఇవ్వ‌డం కూడా టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. మ‌రోవైపు వార‌స‌త్వం - ప్ర‌త్యేక హోదా - పోల‌వ‌రం స‌హా ఇత‌ర అంశాల విష‌యంలో ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌కు భ‌విష్య‌త్తులో త‌గు రీతిలో స్పందించాల‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.