Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌ధాని డిజైన్ మళ్లీ మారుతోందా ..!

By:  Tupaki Desk   |   26 July 2016 12:03 PM GMT
ఏపీ రాజ‌ధాని డిజైన్ మళ్లీ మారుతోందా ..!
X
ప్ర‌పంచానికి త‌ల‌మానికంగా ఉండేలా, కొన్ని శ‌తాబ్దాల పాటు త‌న పేరు నిల‌బ‌డిపోయేలా ఏపీ సీఎం చంద్ర‌బాబు నిర్మించ‌త‌ల‌పెట్టిన రాజ‌ధాని నిర్మాణ డిజైన్ ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్ప‌టికే ఓ డిజైన్‌ ను ఆమోదించేసిన‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజంలేద‌ని తాజా ప‌రిణామాలు వెల్ల‌డిస్తున్నాయి. రాజ‌ధాని నిర్మాణం అంత‌ర్జాతీయ స్థాయిలో ఉండేలా చంద్ర‌బాబు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. హైకోర్టు - సెక్ర‌టేరియ‌ట్‌ - అసెంబ్లీ - మంత్రుల నివాసాలు - న్యాయ‌మూర్తుల గృహాలు - మీడియా హౌస్ ఇలా దేనిక‌దే ప్ర‌త్యేకంగా ఉండేలా రాజ‌ధానిని ప్లాన్ చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధానికి నిర్మాణానికి సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్ గీసి ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌పంచ స్థాయి ఆర్కెటిక్ సంస్థ‌ల‌ను ఆహ్వానించారు.

దీనికి స్పందించిన అనేక సంస్థ‌లు త‌మ‌దైన శైలిలో అమ‌రావ‌తి నిర్మాణం ఇలా ఉంటే బాగుంటుంద‌ని, ఇలాగైతే అదిరిపోతుంద‌ని పేర్కొంటూ ఆయా డిజైన్ల‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించారు. జ‌పాన్‌ కు చెందిన పుమిహికో మాకీ అనే సంస్థతో పాటు మ‌న దేశానికే చెందిన బీవీ దోషి అనే సంస్థ‌ల డిజైన్లు పోటాపోటీగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. అంసెబ్లీ ఇలా - హైకోర్టు ఇలా.. ఇక్క‌డ వాణిజ్య స‌ముదాయం అంటూ వ‌ర్చువ‌ల్ ఎఫెక్ట్స్‌ ను క‌ళ్ల‌కు క‌ట్టాయి. వీటిని క్షుణ్నంగా ప‌రిశీలించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వాటిలో మాకి రూపొందించిన డిజైన్ల‌కు ఓకే చెప్పింది. అయితే, కొన్ని రోజులు గ‌డిచిన త‌ర్వాత మాకీ డిజైన్ల‌లో అసెంబ్లీ భ‌వంతుల రూప‌క‌ల్ప‌న అణు విద్యుత్ కేంద్రాల‌ను పోలీ ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దాంతో ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

ఇక‌, ఇప్పుడు మ‌లేసియాకు చెందిన సంస్థ స‌రికొత్త డిజైన్ల‌తో ఏపీలో అడుగుపెట్టింది. ప‌విత్ర స‌భ‌(శాస‌న‌స‌భ‌) - పీపుల్స్ సెక్ర‌టేరియెట్‌(స‌చివాల‌యం) - న్యాయ‌దేవాల‌యం(హైకోర్టు) అంటూ కొత్త పేర్ల‌తో స‌రికొత్త గ్రాఫిక్స్‌తో ఆర్టీయే హారీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే సంస్థ ఈ డిజైన్ల‌ను ఇచ్చింది. వీటిని కూడా ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. అయితే, దేనికి ఓకే చెప్పాలి అనే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. మాకీ మిగులుతుందో.. లేక హారీస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ కు ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపుతుందో చూడాలి. మొత్తానికైతే ప్ర‌స్తుత రాజ‌ధాని డిజైన్‌ పై మాత్రం ముఖ్యమంత్రి ఏమంత సంతృప్తిగా ఉన్న‌ట్టు లేర‌నేది క‌న్‌ ఫ‌ర్మ్ అయింది.