Begin typing your search above and press return to search.

నాలుగు ఎంపీ సీట్ల‌కు టీడీపీ అభ్య‌ర్థులు ఫైన‌ల్!

By:  Tupaki Desk   |   21 Feb 2019 6:45 AM GMT
నాలుగు ఎంపీ సీట్ల‌కు టీడీపీ అభ్య‌ర్థులు ఫైన‌ల్!
X
ఎన్నిక‌ల‌కు ఆర్నెల్ల ముందే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌టం ఏపీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అల‌వాటే. ఎన్నిక‌లు ఏమైనా.. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణ‌లు.. క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు చెప్పే చంద్ర‌బాబు.. అంత ఎక్స‌ర్ సైజ్ చేసిన త‌ర్వాత కూడా ఓట‌మిని మూట‌క‌ట్టుకునే విష‌యంలో బాబు ట్రాక్ రికార్డునుఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు.

ఓవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగి ప్ర‌చారంలో దూసుకుపోతున్నా.. బాబు మాత్రం క‌స‌ర‌త్తు పేరుతో విలువైన కాలాన్ని వృధా చేస్తార‌న్న పేరుంది. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితిగా చెప్పాలి. అభ్య‌ర్థుల ఎంపిక‌లో తీవ్ర జాప్యం ప్ర‌ద‌ర్శించిన బాబు.. అందుకు త‌గ్గ‌ట్లే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వ‌చ్చింది.

అభ్య‌ర్థుల్ని ఎంపిక చేయ‌టంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా అన్న‌ట్లుగా ఉంటే.. బాబు ఇందుకు పూర్తి భిన్న‌మ‌ని చెప్పాలి. అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఎంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటే అంత మంచిద‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న ప్ర‌యోగంతో తేల్చి చెప్పార‌ని చెప్పాలి.

కేసీఆర్ వ్యూహాన్ని బాబు అనుక‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా వీడియో కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడిన బాబు.. రానున్న ఎన్నిక‌ల్లో నాలుగు లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించి అభ్య‌ర్థులు రెఢీ అయిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. అభ్య‌ర్థులు రెఢీ అని.. నాలుగు ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతూనే.. వారి పేర్ల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌.. అభ్య‌ర్థులు ఫైన‌ల్ అయితే ప్ర‌క‌టించ‌టానికి బాబు ఎందుకు ఆగుతున్న‌ట్లు అన్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి.