Begin typing your search above and press return to search.

బాబు పెట్టిన సంతకం రూల్ తెలుసా?

By:  Tupaki Desk   |   24 July 2016 6:20 AM GMT
బాబు పెట్టిన సంతకం రూల్ తెలుసా?
X
ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు.. అసెంబ్లీకి వెళ్లటం మామూలే. అయితే.. ప్రజాప్రతినిధులు ఎంతమంది ఎంత ఠంచనుగా పార్లమెంటు.. అసెంబ్లీలకు హాజరవుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే.. తెలుగుదేశం పార్టీలో అనుసరించే ఒక ఆనవాయితీ గురించి తెలిస్తే మాత్రం అవాక్కు అవ్వాల్సిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంటుకు వెళ్లినా.. వెళ్లకున్నా.. పార్టీ ఆఫీసు మాత్రం ఠంచనుగా వెళ్లటం కనిపిస్తుంది. ఎందుకలా అంటే.. పార్టీ అధినేత చంద్రబాబు పెట్టిన రూల్ అని చెబుతారు. ఇంతకీ ఆ రూల్ ఏమిటన్న విషయంలోకి వెళితే..

పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఎంపీలు అక్కడి రిజిష్టర్లలో సంతకాలు చేస్తారు. అలా చేయటం ద్వారా వారికి సమావేశాలకుహాజరైన దానికి రూ.2వేలు చొప్పున పార్లమెంటు భత్యం చెల్లిస్తుంది. ఇలా భత్యం చెల్లిస్తున్నా.. పార్లమెంటుకు హాజరుకాని నేతలెందరో తెలిసిందే. అయితే.. సమావేశాలకు డుమ్మా కొట్టే తెలుగు తమ్ముళ్లు.. నిత్యం పార్టీ ఆపీసులో మాత్రం దర్శనమిస్తారు. ఇది మామూలు ఎంపీ దగ్గర నుంచి కేంద్రమంత్రిగా ఉన్న వారు కూడా.

ఇలా ప్రతిరోజూ ఆఫీసుకు వచ్చి ఏం చేస్తారంటే.. అక్కడున్న పుస్తకంలో సంతకం పెడతారు. ఈ సంతకం ఎందుకంటే.. పార్టీ ఆపీసుకు రోజూ వస్తున్న విషయం తెలీటం కోసం అని చెబుతారు తెలుగుదేశం పార్టీ నేతలు. పార్లమెంటుకు వెళ్లినా.. వెళ్లకున్నా అడిగే వాడులేకున్నా.. రోజూ పార్టీ ఆఫీసుకు వెళ్లకపోతే మాత్రం.. ఎందుకు వెళ్లటం లేదన్న ప్రశ్నను పార్టీ అధినేత నుంచి వస్తుందనిచెబుతారు. అందుకే.. ఎంపీ మొదలు.. కేంద్రమంత్రిస్థానంలో ఉన్న వారు సైతం రోజూ ఢిల్లీ పార్టీ ఆఫీసుకు వెళ్లి.. తమ హాజరును అక్కడున్న పుస్తకంలో నమోదు చేయటం కనిపిస్తుంది. పార్టీ అధినేతగా చంద్రబాబు రూల్ బాగుంది కదూ?